ఆదివారం, ఆగస్టు 24, 2008

జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -3

On Cloud 9

మెఘాలలో  Photo: cbrao

ఊహల ఊయలలో ఊగే పూర్ణిమ సూచనపై, వ్యాఖ్యలకు ప్రేరణ అయిన మూల టపాల లింక్స్ కూడా, వ్యాఖ్య కింద ఇస్తున్నాను. మూల టపా చదవాలనుకునే ఆసక్తికలవారికి, ఈ లింక్ దోహదపడకలదు.

Urban Sophistication అంటే ఏమిటి?

మన కట్టు , బొట్టు, మాట్లాడే తీరు (భాష, మాండలీకం), చదివే పుస్తకాలు, చూసే సినిమాలు, ఆహారం తినే విధానం ఇవన్నీ అవతలి వారిలో మనపై ఒక అభిప్రాయాన్ని కలిగించే అంశాలు. Urban Sophistication లో నవ్వే తీరు, కూర్చునే విధానం కూడా ఒక ముఖ్యమైన భాగం. గ్రామాల నుంచి పట్టణం కొత్తగా వచ్చిన యువతీ, యువకులకు పట్టణం లో పుట్టి పెరిగిన వారికీ పైన పేర్కొన్న వాటిలో తేడాలను సులభంగా గుర్తించవచ్చు. ఒక పట్టణం అమ్మాయి ఆహారం తినే తీరు (style) చూసి ప్రేమలో పడ్డ అబ్బాయి కథ విన్నాను. పల్లెటూరి వారు ఆహరం తీసుకునేటప్పుడు చేసే శబ్దాలను పట్టణంలోని నాగరికులు హర్షించరు. ఒక పల్లె యువతి కొప్పుకూ, పట్టణ యువతి hair-style కూ ఉన్న తేడా గమనిస్తే Urban Sophistication దృశ్య రూపంలో కూడా చూడవచ్చు. "అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా" - ఇది పట్టణ యువతుల సింగారపు పలకరింపు.

Urban Sophistication అంటే style, ఆధునిక, అభ్యుదయ నాగరికత ల కలగలుపు.

http://parnashaala.blogspot.com/2008/08/urban-sophistication.html

కవి అంటే

నాకు ఒక పేరు గాంచిన, పెయింటర్ స్నేహితుడున్నారు. ఆయనకు స్నేహితులపై ఎవరిపైనన్నా (వాళ్ల పనులు నచ్చకపోతే) కోపం వస్తే అంటారు 'నువ్వు మనిషివా, కవివా?" కవి అంటే ఇంకో అర్థం కూడా ఉంది. కనిపించకుండా విసిగించేవాడు అని. మనకు ఎన్నో ఈతిబాధలుంటాయి. వాటిలో కవిబాధ కూడా ఒకటి.
కాని దేవులపల్లి కవితలు మనసును గిలిగింత పెడ్తాయి. ఈనాటి ఈ బంధం ఏనాటిదో చిత్రంలోని, ఎస్ రాజేశ్వరరావు స్వరపరచిన "ఎవరు చెప్పారమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకూ" పాట వినండి. స్నేహ హృదయులు అడగకుండానే సహాయం చేస్తారనే అర్థం కూడా ఈ పాటలో ఉంది.

http://manishi-manasulomaata.blogspot.com/2008/08/blog-post_21.html

పుష్ప విలాసం

చదివినదానిని, విన్నదానిని గ్రహించటమే కాక, వాటికి దృశ్య రూపం ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది మనస్సు. విరజాజి అనగానే కమ్మటి సువాసనల తలపులు మన మనసులో తడతాయి. ఇంకా వేసవి కాలం, వెన్నెల రాత్రులు గుర్తుకు రాక మానవు.

http://virajaaji.blogspot.com/2008/08/blog-post.html

మానవ సేవే మాధవ సేవ

"మానవ సేవే మాధవ సేవ - అదే భక్తి! అదే దేవుణ్ణి చేరే సులభ మార్గం." -దేవుడి కి దూరమవుతున్న బీదా బిక్కీ, మధ్య తరగతి వారిని ఆకట్టుకోవటినికి మానవ సేవే మాధవ సేవ అని చెప్పి, స్వామి వివేకానంద, దూరంగా ఉన్న మఠాన్ని ప్రజలకు దగ్గర చేశాడు.

"తిరుపతి వెంకన్నకు ఆరు కోట్ల రూపాయల వజ్ర కిరీటం బహుకరణ - ఒక బెంగలూరు భక్తుడి చేత. " - ఇలాంటి వార్తలు చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఆ డబ్బుని మానవసేవ కు ఉపయోగిస్తే! అన్న ఆలోచన కలుగుతుంది మానవతావాదులకు. సమాజంలో అసమానతలు ఎక్కువున్న సమయంలో, ఆ డబ్బు ఇంకా ఉపయుక్తంగా ఖర్చు పెట్టే మార్గం లేదా? - అని మనసు ఘోషిస్తుంది.

పెద్ద వారు తమ శక్తి, ధన బలాన్ని మానవ సేవకు ఎందుకు వినియోగించరు?

http://sangharshana.blogspot.com/2008/08/blog-post_21.html

జోకులు -పదాలు

జోకులు పేలటానికి స్థానబలిమే కాదు, సమయం, సందర్భం కూడా కలిసి రావాలి. అంతే కాదు, జోకు చెప్పటం లో, ఎక్కడ, ఎంత విరామం ఇవ్వాలో కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ వున్న పాళ్ల బట్టి, జోకు పేలటమో లేక తుస్సు మనటమో కద్దు. "నీవుండేదా కొండపై నా స్వామీ! నేనుండే దీ నేలపై" -ఇదే పాటను ప్రాసకోసం, నేను ఇలా పాడుకొంటాను. నీవుండేదా కొండపై నా స్వామీ! నేనుండే దీ బండపై. వాచోమి(వాహన-చోదక-మిత్రుడు) (© రానారె), చేపలు (చెయ్యవలసిన పనులు) (© వీవెన్) పద ప్రయోగాలు బాగు బాగు. ఏన్ని పదములు నేర్చినావొ.. ఎన్ని కలలను దాచినావొ..
కొనగోట మీటిన చాలు..

http://mynoice.blogspot.com/2008/08/blog-post_21.html

బ్లాగు టపాలపై వ్యాఖ్యలు

ఈ వ్యాఖ్యలు బాగా ఉంటే దానికి కారణం, వాటి ప్రేరణ అయిన మూల టపాలు. మంచి గంధం పూసుకుంటే చక్కటి సువాసనలు, మంచి టపా చదివితే మంచి వ్యాఖ్యలూ వస్తాయి. టపా చదివే సమయం, అప్పటి మూడ్ బట్టి కూడా వ్యాఖ్యల్లో తేడాలుంటాయి.

http://deeptidhaara.blogspot.com/2008/08/2_24.html

కత్తి లాంటి బ్లాగు

ఏ భూమికో (అమ్మాయే సన్నగా, అర నవ్వే నవ్వగా) కనిపిస్తే, మీ సౌందర్య రహస్య మేమిటి అని అడగలనిపిస్తుందా మీకు? మన నడుము కొలత పెరిగాక, భూమిక నడుము ఇంత సన్నగా ఎలా ఉంది చెప్మా అంటూ ఆశ్చర్య పడటం కద్దు. అడపా, తడపా టపాలు రాసే వారు, మహేశ్ ను చూసి ఇలాగే ఆశ్చర్య పడతారు.పర్ణశాల లో కూర్చుని మహేశుడు బ్లాగు టపాలు, అలవక, రోజూ ఇలా, ఎలా కత్తుల్లా విసురుతున్నాడో అని అచ్చెరువంది, మొన్న హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశానికొచ్చినప్పుడు, అడిగా " ఇన్ని టపాలు, ఉల్లాసంగా, ఉత్సాహంగా రాయటానికి మీరేమి తాగుతారు?" అని. చిర్నగవే సమాధానంగా దాటవేశాడు. ఫైల్ పై సంతకం పెట్టే ముందు, కలెక్టర్ గారు చూసే చిత్రం లో ఎవరున్నారో తెలుసుకోవటానికి చిన్న పరిశోధన చేసినట్లుగా, భొపాల్ వెళ్లి మహేష్ బ్లాగు రహస్యం తెలుసుకోవాలి. పర్ణశాలలో ఒక టపా ప్రచురించబడ్డాక, వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాయాలి?

http://parnashaala.blogspot.com/2008/08/blog-post_2109.html

గమనిక: కేవలం బ్లాగు టపాల కామెంట్లతో వచ్చిన ఈ వ్యాసాలకు, తెలుగు బ్లాగు చరిత్ర కారుల ఉపయోగార్ధం, Telugu Blog History అనే Tag ఉంచటమైనది.

1 వ్యాఖ్య:

విరజాజి చెప్పారు...

చాలా సంతోషం భాస్కర రావు గారూ... నా బ్లాగ్ మీ దృష్టి లో పడటం నా అదృష్టం. ఈ రోజే ఒక కొత్త టపా రాశాను. చదివి మీ కామెంట్స్ రాయడం మరువకండి... మీ సూచన ప్రకారం .. "word Verification" feature disable చేశాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి