ఈ మధ్య మన రోడ్ల పై సెల్ లో మాట్లాడుతూ, Road crossing చేసే వాళ్లూ, తలకాయ వంచి సెల్ వింటూ, మోటార్ సైకిల్ నడిపే వారు ఎక్కువయ్యారు. కారులో వెళ్లే వారు ఇందుకు మినహాయింపు కాదు కాని గుడ్డిలో మెల్ల అన్నట్లుగా బ్లూ టూతో, లేక వైర్ వున్న హెడ్ ఫోన్సో వాడుతున్నారు. ఇది సాంకేతికంగా మెరుగైన పరిష్కారమైనా, ఫోన్ లో జరిపే సంభాషణల వలన మానసిక ఉద్వేగానికి లోనయి, ప్రమాదానికి లోనయ్యే అవకాశముందని, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్షేమంగా గమ్యస్థానానికెళతారో, లేక సెల్ తో సరసాలాడతారో, మీ చేతుల్లోనే ఉంది.
సెల్ లో మాట్లాడుతూ, వాహనాన్ని నడపడటము, మృత్యువు తో ఆటలాడినట్టే. ఈ ఆట మీకు ఇష్టమయితే, ఆడండి; ఎవరు కాదంటారు? మీ జీవితం , మీ ఇష్టమైనా, ఈ ఆటలో, మీ తోటి ప్రయాణీకుల, ప్రాణాలు పోయే ప్రమాదముంది. వారి ప్రాణాలతో ఆటలాడే హక్కు మీకుందా? అది నేరం కాదా?
7 కామెంట్‌లు:
nijamey nandi rao gaaru, andukey nenu almost car drive cheseppudu phone conversation cheyyatledu!!!
nice post...
అవును నిజం!
ఫొటో చాలా బాగుంది.
అవును నిజమే. ఇప్పుడంత సెల్ రాజ్యం అయిపోయింది, బస్లో, ట్రైన్లో ఫ్రండ్ కనిపిస్తే మాట్లాడుదామనే ఉబలాటాన్ని సెల్ నాశనం చేస్తోంది. ఫ్రండ్స్ కూడా ఫోన్ లొనే మనకి దొరికేది. ఎదురుగుండా ముఖా ముఖీ గా మాట్లడడానికి టైం లేదు ఎవరికి. జగమంతా సెల్ మయం.
సెల్‌ఫోన్ తరంగాల వల్ల చిన్న పిచుకలు అంతరించిపోయే ప్రమాదం అంచుకు చేరుకున్నాయి. సెల్‌ఫోన్ల వల్లే భార్యాభర్తా సైతం మాట్లాడుకోవడం అరుదైపోతోంది.
వీటి వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ!
అత్యవసర సందర్భాల్లో తప్ప సెల్ వాడకూడదని ఎప్పుడు తెలుసుకుంటారో!!
మీ టపా వల్ల కనీసం ఒక్కరైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ మాట్లాడటం మానేస్తారని ఆశిస్తాను.
మంచి టపా.
అవును నిజమే.... జీవితం చాలా విలువైనది.
correct. సెల్ మాట్లాడుతూ బొక్క బోర్లా పడి చచ్చినా మనకి కాని దేశానికి గాని వచ్చే నష్టం ఏమి లేదు.
కాని దారిన పోయేవారి పరిస్తితి ఏమిటి.. దారుణం కదా??
chakkaga vivarincharu...
కామెంట్‌ను పోస్ట్ చేయండి