శుక్రవారం, జనవరి 02, 2009

స్పందన



View from my window at San Jose, CA Photo: cbrao


ఈ-తెలుగు స్టాల్లో

మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు సంతోషం. మహిళ బ్లాగర్లు ఒకరినొకరు కలిసే అవకాశం ఇన్నాళ్లకు, e- తెలుగు స్టాల్ ద్వారా వచ్చినందుకు ప్రమోదం. ఛాయా చిత్రాలకింద పేర్లు రాయకపోతే, ఎవరెవరో ఎలా పోల్చుకోవటం?
"అప్పటివరకూ ఊహల్లో వేరే రూపాలు ఉన్నా, కలుసుకున్న తర్వాత వెంటనే ఎప్పటినుంచో స్నేహితులుగా మసలుతున్న అనుభూతితో ముచ్చటించుకున్నాం అందరం! రూపాలకు ప్రాముఖ్యం లేదని తేలిపోయింది."
-ఇది పూర్తి సత్యం కాదు. పాక్షిక సత్యం. అందరి అనుభవాలు ఒక్కలా ఉండవు.

http://manishi-manasulomaata.blogspot.com/2008/12/blog-post_25.html



పురాణ ప్రలాపం

@ యోగి - The outcast : హైదరాబాదు నగరంలో జానిటర్లు ఒక వారం రోజులు సమ్మె చేస్తే వారి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షించటం లో వారి పాత్ర ఎంతో చెప్పుకో తగ్గది.


"వేధాలు" అచ్చు తప్పు గురించి రాసినందుకు ధన్యవాదాలు. సరిచేశాను.
పురాణ ప్రలాపం పుస్తకం లో రాసిన విషయాలను, అసందర్భంగా, హేతుబద్ధంగా లేని వాటి గురించి రాయండి.చర్చించండి. వ్యక్తుల పై ఛలోక్తులేల? పుస్తకాన్ని విమర్శించండి. ఫలానా విషయం తప్పు రాసారని సోదాహరణంగా రాయగలరు. అప్పుడు నేనూ మీతో ఏకీభవిస్తాను.

http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html


అమ్మనాన్నల ఆఖరి ఉత్తరం


ఈ కథ ఈ రోజే చదవటం జరిగింది. గుండె ఝల్లుమంది. గతంలో ఒక చిత్రంలో (దాసరి నారాయణరావు?) ఇలాంటి సన్నివేశమే చూశాను. ఆంగ్లంలో ఒక నానుడి Great men think alike అని.

http://palakabalapam.blogspot.com/2008/12/blog-post_20.html


మంచుతుఫాను

మంచు పడటాన్ని ఆపలేనప్పుడు, మంచు పడటాన్ని ఆనందించాలి. మేము snow చూడాలంటే ఎంతో ఖర్చు పెట్టి Lake Tahoe వెళ్లాలి. ఖర్చు లేకుండా మీ దగ్గరికే మంచు రావటం, మీ అదృష్టం. మీ మంచు చిత్రాలు చూశాక నాకు Mount Shastaa కు ఎప్పుడు వెల్దామా అనిపిస్తుంది.

-cbrao
San Jose, CA

http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_8161.html



దేవరపల్లి రాజేంద్రకుమార్

రాజేంద్ర మరో పార్శ్వం సినిమాలు గురించిన ప్రశ్నలేవి? విశాఖతీరాన నడపటంలో అనుభవాలు గురించిన ప్రశ్న ఏది? వ్యక్తిని బట్టి ప్రశ్నలలో వైవిధ్యం చూపాలి.

http://chaduvu.wordpress.com/2008/12/26/interview09/


ఫిరోజ్ గాంధి

ఫిరోజ్ గాంధి సెప్టెంబర్12, 1912 న ఒక పార్శీ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి తండ్రులు రతిమాయ్, జెహంగీర్ ఫరెదూన్. మరింత సమాచారానికై చూడండి Feroze Gandhi was a Parsi

చరిత్ర పై రాయాటానికి కావలసినది B.A., M.A. (History) డిగ్రీలు కాదు . ఉండవలసింది చరిత్రను విశ్లేషించగల నైపుణ్యం. ఒక వ్యక్తి గొప్పదనం అతని పూర్వీకుల వల్లనో లేక వారసుల వల్లనో కాదు. తను సమాజానికి కొత్తగా ఏమి చెప్పాడు, ఇచ్చాడు అన్న అంశాలపై ఆధారిపడిఉంటుంది. ఉదాహరణగా రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు వగైరాలను తీసుకోండి. ఆధ్యాత్మిక రంగంలో ఐతే మీకు స్వామి వివేకానంద ఉదాహరణగా నిలుస్తారు. వీరి గొప్పతనం వారి పూర్వీకులపైనో, వారసుల పైనో ఆధారపడి లేదు. కొన్ని విషయాలకు నిర్ధారిత చరిత్ర లభించటం కష్టం. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించటమే మనము చెయ్యగలిగినది.

http://hinducharities1.blogspot.com/2008/12/blog-post_716.html



తెలుగు బ్లాగు రచయితలు, పాఠకులు
@ఇస్మాయిల్: మీ ఆత్మీయ ఆహ్వానానికి ధన్యవాదాలు. అట్లాంటా దాకా వచ్చాను. మీ గురించిన సమాచారం నా వద్ద లేక పోవటం తో, మిమ్ములను కలువలేక పోయాను. నా వ్యక్తిగత వేగుకు మీ చిరునామా, ఫోన్ నంబర్లు పంపగలరు. ఈ సారి down south వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పక కలుస్తాను. ఈ లోపు మీ ప్రాంత తెలుగు పాఠకుల, రచయితల సమాచారం సేకరించండి.

మీ ఊరు న్యూ ఒర్లేన్స్ వస్తే Tuesday Feb.24.2009 న జరిగే Mardi Gras పండగకు రావాలి. అప్పుడు నగరమంతా ఊరేగింపులతో కోలాహలంగా ఉంటుంది. Bluegrass, Jazz సంగీతం వింటూ, మార్గరిటా ఇష్టంగా తాగుతూ, Cajun/Creole/New Orleans-style ఆహారం తింటూ, ఆనందించటానికి అంతకంటే మంచి సమయముండదు.

@ మాలతి: మీకు సీన్ లేక పోవటమేమిటి? మీరు మంచి రచయిత్రుల కోవలో ఉన్నారు. సరయూ మీ అమ్మాయి. ఇవి చాలవా? సరే ఇంతకీ విషయమేమిటంటే, బ్లాగర్ల దినొత్సవం నాడు మీరు మీ ఇంట గాని లేక మీకు రెండు గంటల దూరంలో ఉన్న రాధిక (స్నేహమా....) ఇంట గాని సమావేశమవ్వండి. ఆ విశేషాలు మీ బ్లాగులో రాయండి. చికాగో బ్లాగర్ల సమావేశానికి మీకు ఆహ్వానం పంపమని అక్కడి బ్లాగర్లకు రాస్తాను. మీకు వీలయితే వెళ్లవచ్చు. డెట్రాయిట్ సమావేశం లో ఎందరో సాహితీ ప్రేమికులను కలిసే అవకాశం కలిగింది. మీరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది.

మీ ఊరొస్తే నాకు మీ, సరయూల ఆటోగ్రాఫ్స్ ఇస్తారా? "స్నేహమా" రాధిక వివరాలిస్తూ మీకు వ్యక్తిగత వేగు పంపుతున్నాను. వారిని సంప్రదించి సమావేశమవ్వండి. నా వివరాలు కూడా పంపుతున్నా, మీకు వీలయినపుడు మాట్లాడవచ్చు.

@ మాలతి:
సరే. మీకు రాధికకు వీలుకుదిరినప్పుడే కలవండి. తెలుగు సంఘాలలో పదవులకై , అంతర్గత ముఠా కుమ్ములాటలు, సంఘాలపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసాయి. అదృష్టవశాత్తు తెలుగు వికీ కి పనిచేసే వారు, బ్లాగులు రాసే వారు నిస్వార్ధంగా, లాభాపేక్షలేకుండా పని చేస్తున్నారు.

తెలుగు వికి కి మీరు కొత్త అని తలుస్తాను. ఒక అసమగ్ర వ్యాసం రంగనాయకమ్మపై ఉన్నది. అది విస్తరించగలరా? చూడండి

http://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE

ఇంకా వికీలో చెయ్యవలసిన పనులు చాలా ఉన్నయ్. ఒక సారి వికీలో రాయటం మొదలు పెడితే, అవేమిటో, మీకే తెలియగలవు.

రచయిత్రి నిడదవోలు మాలతి పై ఎలాంటి పరిచయ వ్యాసం లేదు. అది రాయవలసిఉన్నది. కొంత వ్యవధి తర్వాత నేను ఆ పని ప్రారంభించాలి.


http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post.html


ముంబాయి పై "టెర్రర్ ఎటాక్"
ముంబాయి నగరం పై ఉగ్రవాదుల దుశ్చర్య ఖండించాల్సిందే. అది ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా ధైర్యం కోల్పోక, రెండు జొకులు చెప్పి, నువ్వు నవ్వి మమ్ములని నవ్వించావు. ఇప్పుడు ముంబాయి లో జీవితం మరలా ఎప్పటిలా ఉరకలు-పరుగులుగా మారి ఉంటుందని తలుస్తాను. ముంబాయిలో నీ కొత్త స్నేహితుల గురించి రాసినట్లు లేదు. ఇంకా ఎవరూ స్నేహితులు కాలేదా?
-cbrao
San Jose, CA

http://sravyavarali.blogspot.com/2008/12/blog-post.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి