గురువారం, మే 29, 2008
పురాణ ప్రలాపం
Purana Pralapam by Harimohan Jha
ప్రొఫెసర్.హరిమోహన్ ఝా, ప్రసిద్ధిగాంచిన రచన, ఖట్టర్ కాకా కు, ఇది తెలుగు అనువాదం. చదువుతుంటే అనువాద రచనలా అనిపించదు. ప్రొఫెసర్.జె.లక్ష్మిరెడ్డ్ది గారి సరళమైన స్వెచ్ఛానువాదం ఇది.వేదాలు మొదలు గీత వరకు, రామాయణం నుండి భారతం వరకు, ఆయుర్వేదం నుండి గ్రహణాలు, జ్యోతిష్యం వంటి ప్రజాబాహుళ్య అంశాలు చర్చనీయాంశాలుగా స్వేకరించారు. ప్రతి అంశాన్ని చీల్చి చండాడు తున్నప్పుడు మూల గ్రంధాలనుండి ఆధారాలు చూపి, విమర్శకులు, భక్తులు మాట్లాడకుండా చేయగలిగారు. అవశ్య పఠనీయమైనది.
ఈ గ్రంధం పై, నరిసెట్టి ఇన్నయ్య గారి సమీక్ష ఇక్కడ చూడండి.
http://naprapamcham.blogspot.com/2008/05/blog-post_23.html
ఈ పుస్తకం ఈ నెలలోనే విడుదలయ్యింది. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యమవుతుంది. ఇ-పుస్తకం ఉచితం. ఇక్కడ చదవవొచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు.
ఈ పుస్తకం చదివి, మీ అమూల్య అభిప్రాయాలు, తెలియచేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
This is Dr Vinod Reddy from Sydney. I strongly believe in God and continue to believe him today. My wife died 4 years back.
I read chapetr 17 page 171 Purohit.
I have been looking to find a right poojari or a purohith and could not find until today. I want some one to explain me how to do a pooja.
I also met chinnajjeyar swami but all the purohits around him are commercial.
I never met a poojari who just does prayers. I am still not able to understand the meaning of concentional prayers of vigraharadhana etc?
This chapter reflects the same reasons why I am running away from the a purohith.
but I believe in god the power managing this universe may be science god or solar system god or nature god.
I seek knowledge from eveidence based people.
Vinod (velete@hotmail.com)
Sydney
Jai Telangana
I am a supporter of smaller states and Telangana People needs their own independent state.
33% votes proves the right direction.
"రామాయణం నుండి భారతం వరకు, ఆయుర్వేదం నుండి గ్రహణాలు, జ్యోతిష్యం వంటి ప్రజాబాహుళ్య అంశాలు చర్చనీయాంశాలుగా స్వేకరించారు. ప్రతి అంశాన్ని చీల్చి చండాడు తున్నప్పుడు మూల గ్రంధాలనుండి ఆధారాలు చూపి, విమర్శకులు, భక్తులు మాట్లాడకుండా చేయగలిగారు. అవశ్య పఠనీయమైనది."
అమెరికాలో ఉన్నట్లుండి జానిటర్ పనిని (దీనికి తెలుగు పదం వినేదానికి బాగోదు) ఆటోమేట్ చేసారనుకో, ఇక్కడ హైదరాబాదు మైత్రీవనంలో జనాలు జానిటర్ కోర్సులని నేర్చుకుంటారు మహాశయా! ఎందుకని అడక్కండి. తల్లిదండ్రులు ఏ పెళ్ళి కో పండక్కో కలుసుకున్నప్పుడు "మీ అబ్బాయి ఎక్కడ జానిటర్? మా అబ్బాయి ఇక్కడే జానిటర్" అని గర్వం గా మాట్లడుకుంటారు.. అసందర్భం గా అనిపిస్తోందా??
పురాణాలనూ, వేదాలనూ(వేధాలు కాదు, సరిచూసుకోగలరు) ఎక్కిరించడం కొంతమంది భుక్తికి ఎంచుకున్న మార్గం. వీరి విమర్శల్లో పస ఎంత అని ప్రశ్నించే వాళ్ళు అసలు లేరని కాదు.. ఈ మేతావి శునకాలతో వాదించడం కష్టం అయ్యీ కాదు. అంతెందుకు, మేతావులతో అర్థవంతమైన మాటలు మాట్లాడలేం గాబట్టి. ఇలాంటివి జనం రాయడం, దాన్ని పెద్దమనుషులుగా చెలామణీఈ అయ్యే వాళ్ళు చేయటం....
@ యోగి - The outcast : హైదరాబాదు నగరంలో జానిటర్లు ఒక వారం రోజులు సమ్మె చేస్తే వారి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షించటం లో వారి పాత్ర ఎంతో చెప్పుకో తగ్గది.
"వేధాలు" అచ్చు తప్పు గురించి రాసినందుకు ధన్యవాదాలు. సరిచేశాను.
పురాణ ప్రలాపం పుస్తకం లో రాసిన విషయాలను, అసందర్భంగా, హేతుబద్ధంగా లేని వాటి గురించి రాయండి.చర్చించండి. వ్యక్తుల పై ఛలోక్తులేల? పుస్తకాన్ని విమర్శించండి. ఫలానా విషయం తప్పు రాసారని సోదాహరణంగా రాయగలరు. అప్పుడు నేనూ మీతో ఏకీభవిస్తాను.
జానిటర్లకు ప్రాముఖ్యం లేదని ఎవరు అన్నారు? మీకు అర్థం కాలేదనుకుంటా.. సరే అర్థం అయ్యేటట్లు చెబుతాను. జనం కుప్పలుతెప్పలు గా అమెరిక ఎందుకెళతారు? సాఫ్టువేరు ఉద్యోగం చేయటం గొప్ప విషయం గా ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకంటే, అది సమాజంలో మనుషులకు "గౌరవాన్ని" కొనిపెడుతుంది, మహాశయా! పూర్వం ఇంట్లో సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని నిల్వజేసినోడు గౌరవనీయుడు.. ఇప్పుడు గౌరవనీయత ఇచ్చే అంశాలు మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్టువేరూ, అమెరికా అని మొదలెట్టకండి. ఇది ఒక ఉదాహరణ, అర్థం చేసుకోవాలి.
అదే విధంగా, సంస్కృతినీ సంప్రదాయాన్నీ వెక్కిరించటం గౌరవనీయమైన పని. వీళ్ళు నిజం గా ఏదో సాధించాలనీ, లేదా సంస్కృతుల పట్ల వివరణాత్మకమైన వ్యాసాలు రాయాలనీ ఇవన్నీ చెయ్యరు అని భావం. మీరు నేను ఆ పుస్తకాన్ని చదవలేదని ముందుగానే asuume చేసుకున్నారు, అది నా తప్పు కాదు.
ఈ పుస్తకాన్ని చదివిన, దానిలోని ప్రతి అంశాన్నీ శాస్త్రీయబద్ధంగా జరిగే చర్చలో ఎదుర్కోగల సాధికారస్వరం తోనే నేను ఆ comment రాశాను. మీకే ఎందుకు రాశాను? మీరు దాన్ని ఉటంకించారు కాబట్టి, జనులను చదవమని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి. మీరన్నట్లు గా మీ ఇన్నయ్య తో గానీ, మీ రచయియితతో గానీ మీతో గానీ Rational, logical గా చర్చించడానికీ, పుస్తకంలోను ప్రతి argument/assumption/comment తప్పు అని prove చెయ్యడానికీ నేను సిద్ధం,నేను చర్చిస్తాను, నావల్ల కాకపోతే I can get top notch professors and intellectuals from the academia (both Indian and Western) to argue on my behalf. Are you guys ready??
ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే, మీరో మీ ఇన్నయ్యగారో రాసిన ఈ ముక్క చూడండి. ఇలాంటివి రాసేటప్పుడు కాస్త సమ్యమనం పాటించండి. జనం చూస్తుంటారు.
"ప్రతి అంశాన్ని చీల్చి చండాడు తున్నప్పుడు మూల గ్రంధాలనుండి ఆధారాలు చూపి, విమర్శకులు, భక్తులు మాట్లాడకుండా చేయగలిగారు. అవశ్య పఠనీయమైనది."
ఇదంతా ధిక్కారమో, పొగరో లేక వ్యక్తిగతదాడో అని కొట్టిపారేయకండి ఎందుకంటే ఇది అది కాదు.
@ యోగి: పుస్తకం పై విమర్శకు ముందు మీ ఉపోద్ఘాతానికి ధన్యవాదాలు. ఈ పుస్తకంలో మీరు విభేస్తున్న అంశాలతో, పుస్తకంలో పేర్కొనబడిన సత్యదూరమైన విషయాల గురించి ఇన్నయ్య గారి బ్లాగులో రాయగలరు. చిరునామా దిగువన ఇస్తున్నా.
http://naprapamcham.blogspot.com/2008/12/blog-post_17.html
I think you don't believe any religion. But you prefer science. This is OK. But chaala grandaallo mataadikaarulu appati science nammakaala valla grandaalne maarchi, vaaru nijangaa nammakamunna vaaru kaadani niroopinchukuntunnaaru. Ask J.W(watchtower.org), they say some changed bible scripts. Islams say more about it. Hindus say britishers changed some vedas for jesus( I don't know then why they don't change more than that).
My only suggestion read all scriptures and contact these religious leaders( JW is better for christian discussions) and think yourself finally. Just follow your heart, but respect others believes. There are so many evils here in the world to fight like dowry, female-baby killing...etc!
Hope you take my comment in positive way.
చర్చ చాలా మూఢంగా ఉంది. 'పురాణప్రలాపం' దేవుడున్నాడా లేడా అన్నవిషయం గురించి కాకుండా, దేవుడి పేరుతో జరుగుతున్న అన్యాయాల్నీ, మూఢనమ్మకాల మత్తులో ఉంచి ప్రశ్నించే హక్కుకి దూరంగా ఉంచుతున్న దోపిడీ వ్యవస్థనీ చీల్చి చెండాడే సత్ప్రయత్నం. దాని మంచి చెడ్డల్ని విశ్లేషించడం మానేసి,--- మీరు మీ ఇన్నయ్య లాంటి ప్రయోగాలు, విమర్శకులు ఎలా విమర్శించాలో తామే చెప్పడాన్ని బట్టి --- సరిగ్గా వారే ఈ ప్రలాప ప్రయత్నం లోని , మూఢనమ్మకాల ప్రతినిధులుగా తేలిపోతున్నారు. శ్రమ శక్తికి కాకుండా దళారీతనానికీ, వీధికో దేవత, ప్రాంతానికో దేవుడు, సీజన్ కొక స్వామి ఉండడంలో మర్మాన్ని బాగా వంటబట్టించుకున్నవారే ఇలాంటి ఉలికిపాటుకి గురవుతారు. C B Rao గారూ, అర్ధం చేసుకోవడానికి అనర్హులైన వారిని పక్కకు పెట్టి మీకృషి మీరు కొనసాగించండి. వరకట్నాలూ, భ్రూణ హత్యలకూ మూలం ఈ మత మౌఢ్యమేనన్న విషయాన్ని గుర్తించండి విదేశాల్లో ఉన్న దేశీయ సంస్కారుల్లారా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి