బుధవారం, మార్చి 10, 2010

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి e-తెలుగు ధ్యేయం




ఇంటర్నెట్ ద్వారా తెలుగుభాష వ్యాప్తి, తెలుగు బ్లాగులకు మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ e-తెలుగు. కంప్యూటర్లకు తెలుగు నేర్పించడం ఎలా? యూనికోడ్ తెలుగు ఫాంట్‌తో పైసా ఖర్చు లేకుండా మన ఆలోచనలకు ఇంటర్నెట్‌లో అక్షరరూపం ఇవ్వడం ఎలా? వీటిని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? టైపింగ్ లేఅవుట్ ఏమిటి? ఇత్యాది పలు అంశాలకు సంబంధించిన పరిష్కారాలను స్వచ్ఛందంగా అందజేస్తూ ఇంటర్నెట్‌లో తెలుగు వాడకానికి సంబంధించిన సాంకేతిక సహకారాన్నీ, తోడ్పాటును ఉచితంగా ఇస్తుంది e-తెలుగు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కేంద్రంగా సేవలందిస్తున్న e-తెలుగు సంస్థ కార్యదర్శి పలివెల కృపాల్ కశ్యప్. ఇటీవల భాషా ఇండియా ఆయన్ని కలుసుకున్నప్పుడు సంస్థ పూర్వాపరాలు, కార్యకలాపాల గురించి ఎన్నో వివరాలందించారు.

e-తెలుగు సంస్థ కార్యదర్శి పలివెల కృపాల్ కశ్యప్ తో భాషా ఇండియా పూర్తి భేటీ కై దిగువ గొలుసులో చూడండి.

http://bhashaindia.com/Patrons/LanguageTech/te/Pages/TeluguInterview.aspx

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి