శుక్రవారం, ఆగస్టు 22, 2008

జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -1

OLYMPUS DIGITAL CAMERA

Poet Tikkana    Photo: cbrao Location: Childrens park, Nellore.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: నా అనుభవం

1969 -1970 కాలంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం హింసాత్మకంగా ఉన్న రోజులలో, నేను ఆబిడ్స్ కు ఏదో కొనటానికి వెళ్లాను. అకస్మాత్తుగా పొలీసులు వచ్చి లాఠీచార్జ్ చెయ్యటం మొదలెట్టారు. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి. అంతా తలో దిక్కు పరిగెత్తటం మొదలెట్టారు. నేనూ పరిగెత్తి, పొలీసుల దృష్టిలోంచి తప్పించుకోవటానికి ఒక Q లో నిలుచున్నా. నేను నిలబడిన క్యూ ఒక సినిమా థియేటర్ వద్ద టిక్కట్లకై నిలుచున్నది. హైదరాబాదు కొత్త నాకు అప్పట్లో. ఎక్కడున్నానో కూడా తెలియదు. టిక్కట్ కొనుక్కుని థియేటర్ లోకి వెళ్లా. నా పక్కనున్న వారిద్వారా తెలుసుకున్నా. అది రామకృష్ణా 70M.M. థియేటర్ అని. అప్పుడు ప్రదర్శింపబడిన చిత్రం It's a Mad Mad Mad Mad World. పేరుకు తగ్గ చిత్రం. థియేటర్ బయట నేను పడిన టెన్షన్ పోయి, మనసారా నవ్వాను. అలా యాదృచ్ఛికంగా ఒక మంచి కామెడీ సినిమా చూసే అవకాశం కలిగింది. తెలంగాణ ఉద్యమ ప్రస్తావనొచ్చినప్పుడు, ఈ చిత్రం (It is a mad mad world) సదా మదిలో మెదల్తూంటుంది. 27 జూన్ 1969 న, ఈ గొడవలకు తలవొగ్గి కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేశారు. అది ఆమోదించబడలేదు. అదంతా ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కథలో భాగం.

Blog Addiction

అందమైన ఆడవాళ్లూ, మీరు ఎక్కువ సేపు కంప్యుటర్ ముందు గడిపితే, స్క్రీన్ నుంచి వచ్చే రేడియేషన్ వలన, మీ facial skin moisture contents తగ్గిపోయి మొహం ముడతలు వచ్చే ప్రమాదముంది. మీ కంప్యూటర్ స్క్రీన్ కు Screen protector అమర్చుకోగలరు. దీని ఖరీదు సుమారుగా 180 రూపాయల నుంచి 250 దాకా వుంటుంది. ఇది మిమ్ములను Ultraviolet rays నుంచి కాపాడగలదు. ఇది కొనటం వీలు కాని పక్షం లో, Sun Protective Lotion SPF (Sun Protection Factor) 25 నుంచి 50 దాకా ఉన్నవి మొహానికి రాసుకొని, కంప్యూటర్ ముందు కూర్చోండి. కంప్యూటర్ ముందు తక్కువ గంటలు గడిపే వారు SPF 15, ఎక్కువ గంటలు గడిపే వారు SPF నంబర్ పెంచుకుంటూ పోతూ వాడండి.

బ్లాగింగ్ ఒక వ్యసనం కారాదు. రోజూ ఇన్ని గంటలనుకుని, అప్పుడు మాత్రమే బ్లాగు పని చూసి, మిగతా సమయంలో దైనందిక వ్యవహారాలు, నిజ జీవిత వ్యక్తి గత మిత్రులకు ఫోన్ చెయ్యటమూ, వ్యక్తిగతంగా కలవటమూ చెయ్యాలి. Morning walk కూడా మరువరానిది.

చిరంజీవి దోశ

చాక్లేట్ అంటే ఎవరికి ఇష్టం వుండదు? నా కైతే చాక్లేట్ కొరికితే, విస్కీ వచ్చే చాక్లేట్లంటే ఇష్టం. దోశలలో ఎన్నో రకాలు. అయితే హైదరాబాదు చట్నీస్ రెస్టారెంట్ లో స్పెషల్ ఐన చిరంజీవి దోశ ఎవరైనా తిన్నారా?

వెండి కొండపై శివుడు

కాళిదాసు రచనలలో లో సౌందర్యతత్వం ఉంటే, నేను చెప్పబొయే దాంట్లో హాస్యతత్వం ఉంది. మా స్కూల్ రోజులలో అలంకారాలు గురించి చదివే సమయంలో, మా తెలుగు పంతులు గారు ఒక విద్యార్థిని ఉపమాలంకారానికి ఉదాహరణ చెప్పమంటే, వెండి కొండపై శివుడు, సుమతి (మా సహ విధ్యార్ధిని) తలలో పేనులా ఉన్నాడు అనే సరికి క్లాసంతా గొల్లుమంది.

కులప్రసక్తి లేని విద్యాసంస్థ

అదృష్టవశాత్తూ,నటుడు మోహన్ బాబు నడుపుతున్న, తిరుపతి లోని విద్యానికేతన్ విద్యాసంస్థల లో, admission forms లో, ఎక్కడా కులప్రసక్తి రాకుండా, తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది అభినందించవలసిన విషయం.

చపల చిత్త మనసు

లేనిది కావాలని మనసు చాస్తుంది అర్రులు

మోజు తగ్గుతుంది, కోరుకున్నది అందుబాటులోకొస్తే

అదంతే మరి, చపల చిత్త మనసు

చాలా కాలం క్రితం ఈ కింది వాక్యాలు చదివాను ఎక్కడో!

As a matter of fact, man is a fool

He wants it hot, when it is cold

He wants it cold, when it is hot

Blogging & Drinking

తెలుగు బ్లాగరులలో తాగే వారున్నారు. కాని తాగుతామని ఒప్పుకునేవారు నాకు తెలిసి ముగ్గురే. ఆ ముగ్గురూ 1) మహేష్ కుమార్ 2) cbrao 3) ఇన్నయ్య. నేను తాగుతూ, బ్లాగుతానంటే నిరసనలు వెల్లువెత్తాయి గతంలో. ఆ విమర్శలు మంచి రచనలెలా చేయాలి? అనే టపా కొచ్చిన కామెంట్లలో చూడవచ్చు.
బాధ్యతాయుతంగా, రసాస్వాదన చేస్తూ తాగటంలో ఆనందముందన్న సంగతి నేను, మా మిత్రులు ధృఢంగా విశ్వసిస్తాము. బ్లాగటం కోసం ఏదైనా చెయ్యవచ్చు; కాని బ్లాగటం , తాగటం మానెయ్యాల్సిన అవసరం లేదు. ఈ రెంటినీ సమన్వయపరచటానికి, కొంత పరిణితి కావాలి. ఈ పరిణితికి వయస్సుకు సంబంధం లేదు. ఈ మాటలు తాగటాన్ని ప్రోత్సహించటానికి కాదు. Drink లేక పోయినా జీవితాన్ని ఆనందించవచ్చు, చక్కటి రచనలు చెయ్యవచ్చు. ఇది వాస్తవం.

అతిథి దేవో భవా

అతిథి, చుట్టాల గురించి ఇంగ్లీష్ భాషలో ఒక సామెత ఉంది (Guests are like fish. After three days they start to smell)- మూడు రోజుల తరువాత, చుట్టం కుళ్లిన చేపలా కంపు కొడతాడు అని. అతిథి దేవో భవా అని భావించే మనమే, దేవుడే దిగివచ్చినా భరించలేము. అందుకే మూడో రోజో, 10 వ రోజో నిమజ్జనం చేసేస్తాం.

నాగుల చవితి కి పుట్టలో పాలు

నాగుల చవితి కి పుట్టలో పాలు పోసినప్పుడు, చీమలు వచ్చి పాము భరతం పడ్తాయి. భక్తితో,మనము పోసే పాలు, పాముకు కీడు చేస్తాయి.

4 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

బాగుంది. ముఖ్యంగా మీకు సందర్భానుసారంగా 'Its a mad mad mad world ' గుర్తుకు రావడం!

Kathi Mahesh Kumar చెప్పారు...

బాగున్నాయ్ మీ వ్యాఖ్యల సంకలం..కొన్ని మ్యూజింగ్స్

Purnima చెప్పారు...

Is it possible to give the links of the blog where you left this comment? Could be too much of work, but then I'm curious to read some of them. Eg: వెండి కొండపై శివుడు

cbrao చెప్పారు...

@పూర్ణిమ: వ్యాఖ్యలకు ప్రేరణ అయిన మూల టపాలపై మీ ఆసక్తి గమనించాను. తదుపరి టపాలలో లింక్ ఇస్తాను. వెండి కొండపై శివుడు వ్యాఖ్య మనసు బ్లాగరి సుజాత రాసిన కాళిదాసు శ్లోకం తాలూకు కథ! అనే టపా పై రాసినది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి