గురువారం, జనవరి 13, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -7

Photo: cbrao

చావు-విషాదమా?ఆనందమా?

"మరణం అంటే ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహం ధరించుట అని జ్ఞానులు గ్రహించి మరణ విషయమై చింతించరు."  -మరణం అంటే మట్టిలో కలిసిపోవటమే. ఆత్మలు చొక్కావిడిచి మరో చొక్కా ధరించినట్లుగా  ఇంకో దేహాన్ని ధరింపవు.  ఒక ప్రాణం పుట్తుంది, గిడుతుంది. సమాప్తం. అంతే జీవిత కధ.  జీవాత్మ పరమాత్మలో కలవటం నమ్మకం, తరాలుగా వస్తున్న విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఈ పునర్జన్మలు, ఆత్మల సిద్ధాంతానికి శాస్త్రాధారాలు లేవు.  భూమి బల్లపరుపుగా ఉందని మతాధికారులు విశ్వసించేవారు. అయితే శాస్త్రజ్ఞులు, చంద్ర గ్రహణ సమయంలో చంద్రుడి పై భూమి నీడను చూసి భూమి గుండ్రంగా ఉందని  తెలుసుకున్నారు.  భూమి బల్లపరుపుగా ఉందని అప్పటిదాకా ప్రజలు గట్టిగా నమ్మారు. అయితే,మనిషి మరణించినా,  తన జన్యువులు, వారసులలో, కణరూపంలో జీవించే ఉంటాయి.    

http://oohalu-oosulu.blogspot.com/2010/09/blog-post.html

నలుపు తెలుపు కొంచె -తనికెళ్ల భరణి కొత్త  బ్లాగు
నమస్కారం
సాహితీ సుగంధులైన అతికొద్ది తారలలో మరొక తార బ్లాగ్ ప్రపంచంలో ప్రవేసించినందుకు ప్రమోదం. ఈ బ్లాగు మీ రచనల పరిమళాలతో గుబాళించగలదని ఆశిస్తాను. మీ కొత్త కవితల పుస్తకాన్ని పరిచయం చేయకోరుతాను. మీ సిరా చిత్రం dvd గా విడుదల అయ్యిందా?

http://tanikellabharanistar.wordpress.com/


పిట్టల తో చెట్టపట్టాల్--ఓ ఆదివారం నా అనుభవం

పిట్టలతో చెట్టపట్టాల్ ఎంత బాగా వ్రాసారండీ! భారతీయ పక్షులను పరిచయం చేస్తూ ప్రఖ్యాత పక్షి ప్రేమికుడు సలీం ఆలి The Book of Indian Birds   పుస్తకం వ్రాశారు.  హైదరాబాదులో లభ్యమవగలదు.  ఈ పుస్తకం చదివాక పక్షుల గురించిన     ఆసక్తి ఎక్కువైతే  Birdwatchers Society of Andhra Pradesh లో సభ్యులుగా చేరవచ్చు.

http://maagodavari.blogspot.com/2010/08/blog-post_22.html

రేడియో అభిమానులకు శుభవార్త

రేడియో లో వచ్చిన అలనాటి మంచి కార్యక్రమాలను శ్రోతలకు అందచేయటంలో కృషి చేస్తున్న మాగంటి వంశి, మీకు, ఇతర బ్లాగర్లకు అభినందనలు.   అక్టొబర్ 2010 లో నేను భారతదేశం వస్తున్నాను. మీ కృషి కి ఉడతా భక్తిగా నా వంతు సహకారం అందివ్వగలను.

http://saahitya-abhimaani.blogspot.com/2010/08/blog-post_24.html

జనార్దన మహర్షి వెన్నముద్దలు

" మా అమ్మ
మా ఆవిడ
నా రెండుకళ్ళు
........
కళ్ళు
ఒకదానినొకటి
చూసుకోవు"
-వా వా! చాలా బాగున్నై.

http://surekhacartoons.blogspot.com/2010/08/blog-post_28.html

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్

దొరుకునా ఇటువంటి సేవా! ఇది కదా నిస్వార్ధ సేవ అంటే. తెలుగు బ్లాగులలో విభిన్నమైన, ప్రయోజనకరమైన బ్లాగిది. భేషో!  

http://worthlife.blogspot.com/2010/08/blog-post_27.html

తుమ్మేటి గారితో కాసేపు (2)

కధా రచయిత తనే స్వయంగా కధ చదివి వినిపించె, కనిపించే వీడియో ప్రక్రియ బాగుంది. తుమ్మేటి గారి అనుమతి తో ఒక కధని Youtube లో పెట్టండి. వీడియో ఎక్కడ లభ్యమవునో తెలుపగలరు. ఇది చూడాలని ఆసక్తిగా ఉంది.

http://bhanu67.blogspot.com/2010/08/2.html

4 వ్యాఖ్యలు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

రావుగారూ....మీ ఉడతా సాయం కోసం ఎదురు చూఊఊఊఊఊఊ...స్తూనే ఉన్నా.... : అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఇప్పుడు జనవరి .....ఇంకా చారలే కనపడుతున్నాయి కానీ ఉడత కనపడలా...కాబట్టి ఉడతని వదలండి మహప్రభో! ...:)

cbrao చెప్పారు...

@వంశీ: ఇన్ని నెలలూ నేను అనేక వ్యక్తిగత పనులలో నిమగ్నమై ఉన్నాను. మీకు ఏమి కావాలో తెలుపండి. నా వంతు కృషి నేను చేస్తాను.

భాను చెప్పారు...

ధన్యవాదాలు తుమ్మేటి గారి అనుమతి ఉంది కాని నాకే సమయం దొరకట్లేదు. వీడియో లు బయట దొరకట్లేదు. తప్పకుండ పెడతానండి

cbrao చెప్పారు...

@భాను : వీడియో కై నిరీక్షిస్తాము.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి