బుధవారం, జనవరి 26, 2011

రెండు వ్యంగ ప్రహసనాలు

ఈ నాటి బ్లాగర్లు, పాత్రికేయుల   తీరుతెన్నుల పై  నా దృష్టికి వచ్చిన  రెండు వ్యంగ ప్రహసనాలు మీముందుంచుతున్నాను. చదివి ఆనందించండి.

మొదటిది

"ఆహా ఎంత చక్కగా నను దోచాడే వాడూ!" 


 ఈ వ్యాస రచయిత శరత్ బ్లాగ్లోకంలో  చిరపరిచుతుడే.

http://sarath-kaalam.blogspot.com/2011/01/blog-post_7856.html  

రెండవ వ్యంగ ప్రహసనం

"నా ఆలోచనలు". ఇది వ్రాసినవారు లైలా యెర్నేని. చనిపోయిన వారి గురించి అలవాటుగా వ్రాసే ఒక పాత్రికేయుడు  రామాయణం గురించి ఇలా వ్రాయవచ్చు అని లైలా గారి భావన. పదండి ముందుకు.  

నా ఆలోచనలు

సరయూ నదిలో మునిగి మరణించిన రాముడు దశరధుని పెద్ద కుమారుడు.
దశరధుడెవడు? అతడు మృతిచెందిన అజుని కుమారుడు. అజుడు చనిపోయిన రఘువు కొడుకు.

దశరథుడు వేటకు వెళ్ళినప్పుడు, అతని బాణం పొరపాటున తగిలి మరణించిన ఒక కుర్రవాని పేరు శ్రవణుడు.

శ్రవణుడు ఒక కావిడి తట్టలో అంధులైన ఇద్దరు అమ్మానాన్నలను మోసుకు తిరిగేవాడు. వారిద్దరూ చనిపోతూ దశరథుడుకి నువ్వు కూడా పుత్రశోకంతో చనిపో అని శాపం ఇచ్చారు.

చనిపోయిన దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య. సుమిత్ర, కైకేయి.
కౌసల్యా సుతుడైన రాముడికి సీతతో వియోగం సంభవించింది.

వారు కలిసున్నప్పుడు, అడివిలో సీతారాములు ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నప్పటి ఈ పాట లింక్ ఇక్కడ ఇస్తున్నాం.

లింకు, యూ ట్యూబు.

ఈ పాటను తెలుగులో జిక్కీ, రాజా పాడారు.

జిక్కీని అనుమానించిన రాజా, రైలు అందుకోటంలో విఫలుడై ఎలా మరణించాడో,

ఆ వివరాలు

ఈ పత్రికలో చూడండి.

వారు పాడిన- ఎంతో మధురమైన "ఆడే పాడే పసివాడ"

ఇక్కడ విని ?ఆనందించవచ్చు.

ఇట్టి రైలు మరణాలను, ఆత్మహత్యలను, తదితర మరణాలను, జర్నలిస్టుగా చూసి, ఆరోగ్యం ఏం బాగుండని ఇతర స్నేహితులనుండి పొందిన మనోవికాసంతో ఒక దశాబ్దం శ్రమించి వెలువరించిన కవితా సంకలనం

ఇక్కడ చదువుకోవచ్చు. వెల $ 10.

అందులో ఒకరి (? :-)నిజంగా) "చివరి" పాట - సాహిత్య పూదోటలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించుకున్న ఆ పాటను వారి గొంతులోనే

ఇక్కడ వినండి. లింకు.

హలో! స్వీటీ! రామాయణమంతా చూసి రాముడుకి సీత ఏమవుతుందో తెలియదా?...

తెలుసు. తెలుసు. సీత భూమిలో కలిసి పోతుంది.

అది కాదు నేనడిగిన ప్రశ్న.

ఓ! రాముడికి సీతకు చుట్టరికం ఏమిటీ? అనా?

అదీ కాదు.

నీ ప్రశ్న ఏదైతేనేం, ఎవరికీ తెలియని రామాయణాన్ని దివ్యంగా పరిచయం చేసినందుకు వారిని స్మరించుకుంటూ, ఆ స్మరణలో వసుధైక కుటుంబానికి
...

The "end."

విధిలేని గాడిది:-)

-రచ్చబండ సౌజన్యం తో

5 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

హహహ రామాయణం కథ చాలా బావుంది. :)

కొత్త పాళీ చెప్పారు...

శరత్ గారి బొమ్మ ఏదో ఫ్యూచరిస్టిక్ సినిమా సెటింగ్ లా ఉంది. ఇది షికాగో మెట్రో రైల్లోనే?? షికాగో రైళ్ళకి రెండంతస్తు లున్నాయా??

cbrao చెప్పారు...

షికాగో suburbs నుంచి నగరంలోకి వచ్చే రైలు రెండంతస్తులు కలిగి ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి సాన్‌హోసె, మౌంటైన్ వ్యూ వగైరాలకు వచ్చే లోకల్ రైలు కూడా రెండంతస్తులు కలిగి ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కో రైలు లో సైకిళ్లకు ఒక పెట్టె, మరుగుదొడ్డి సదుపాయం కూడా ఉంది.

శరత్ కాలమ్ చెప్పారు...

అంటే ఏంటి సార్ మా 'మెట్రా' రైళ్ళలో మరుగు దొడ్డి సౌకర్యం లేదనా మీ ఉద్దేశ్యం? మా రైళ్ళకూ వుంది సార్ ఆ సౌకర్యం.

కొత్తపాళీ గారు అన్నట్లుగా ఆ నా ఫోటో చూస్తుంటే రైల్లో కాకుండా ఏ రాకెట్టులోనో కూర్చున్నట్టుగా వుంది. చక్కగా వచ్చింది ఫోటో.

కొత్త పాళీ చెప్పారు...

అన్నట్టు సరైన స్పెల్లింగు - వ్యంగ్య అని ఉండాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి