సోమవారం, జనవరి 10, 2011

టెలివిజన్ లో కొత్త తెలుగు ధారావాహికలు


టెలివిజన్ లో అరుదుగా మంచి తెలుగు ధారావాహికలు వస్తూంటాయి.  ఈ నెల 17 నుంచి మా టి.వి.  లో సాయంత్రం 7.30 కు మా పసలపూడి కధలు (వంశీ)  ప్రసారం కాబోతుంది.

''నగరంలో వెన్నెల'' నవలకి   అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) వారి ప్రథమ బహుమతి (1994) , ''తెలి మబ్బుల ఛాయ'' నవలకి  ఆటా వారి బహుమతి (2002)  ఆ తరువాత  ''మనోప్రస్థానం'' నవలకి తానా బహుమతి (2003) అందుకున్న రచయిత  పమిడిముక్కల చంద్రశేఖర్‌ అజాద్.  ఎన్నో కధలు, టెలివిజన్ కు పలు సీరియళ్లు  (రాధా-మధు, లయ ఫేం)   వ్రాసిన ఆజాద్ కొత్త సీరియల్ (స్క్రీన్ప్లే ,మాటలు రాస్తూ నటిస్తున్న)  "అడగక ఇచ్చిన మనసు"  ఈ రోజు రాత్రి 10 గంటలకు జెమిని టి.వి. లో ప్రారంభం కానుంది. "లయ"  కు ప్రతిభావంతంగా దర్శకత్వం వహించిన జే.వి.ఎస్.రాజు ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నారు.  

 Don't miss. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి