మంగళవారం, జనవరి 18, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -9

Poster of film Khaleja on the way to Amaravati (Click to enlarge)

ఖలేజా కి నెగిటీవ్ టాక్

ఒక పాఠకుడు (తిరు) వ్రాసిన వ్యాఖ్య ఇది.
"సినిమా చూడకుండా సమీక్ష రాశారా??
మీకు నవతరంగం కి సమీక్షలు రాసే అర్హతొచ్చేసింది."

http://www.ragava.co.cc/2010/10/blog-post_07.html

నాకు నచ్చిన దేవానంద్ సోలోలు - ఆఖరి భాగం - 5 నుండీ 1 దాకా


ప్రియమైన  రౌడీ

ఖొయా ఖొయా చాంద్ అనే పాట  హృదయానికి హత్తుకుపోయిన పాట. ఫూలోంకి రంగ్ సె, దిల్ కి కలం సె -ఈ పాటలో ప్రేమతో కూడిన నిషా ఉంది. రాంకింగ్ ఇస్తే  ఖొయా ఖొయా చాంద్ కే మొదటి స్థానం.  వీడియో మొదట్లో దేవానంద్ గా మీ అహార్యం,  హావ భావాలు, మాట్లాడే విధానం దేవానంద్ కు దగ్గరా ఉండి ఆహ్లాదం కలిగించింది.

http://malakpetrowdy.blogspot.com/2010/10/5-1.html

బ్రౌన్ దొర గారి సమాధి


ఇలా బ్రౌన్  మహనీయుని స్మరించుకోవలసిన అవసరం ఉంది. భారతదేశం లో బ్రౌన్ కు ఎక్కడన్నా స్మృతిచిహ్నం ఉందేమో వెతకాలి.

http://andhragongura.blogspot.com/2010/10/blog-post.html


రేడియో వార్తల వెనుక వ్యక్తులు - భండారు శ్రీనివాసరావు

"అప్పటి రేడియో అనుభవాలను కేవలం బ్లాగుకే పరిమితం చేస్తే ఎలాగ? ఇక్కడ బ్లాగుల్లో ఇటువంటి నాణ్యత గల రాతల్ని పట్టించుకునే వారు తక్కువ ఉన్నారు. చెత్త మాటలతో ఒకరినొకరు ఎత్తి పొడుచుకోడాలు, దెబ్బలాడుకోటాలు..అంతా వీధి పంపుల వ్యవహారం!" -– సుజాత

-సమాజం లో ఉన్న రాగ ద్వేషాలే బ్లాగులలో ప్రవేశించాయి. పుస్తక రచయితలు/రచయిత్రులు కూడా రాగద్వేషాలకు అతీతులు కారు. అయితే గమనించవలసిన విషయం ఏమంటే బ్లాగు పాఠకులు, పత్రికా పాఠకులు వేరు. బ్లాగులు చదివే అంతర్జాతీయ పాఠకులకు తెలుగు పత్రికలు, పుస్తకాలు అందుబాటలో ఉండవు. పత్రికలు చదివే భారతదేశ పాఠకులు అంతర్జాలం జోలికెళ్లరు. ఈ సూష్మం గ్రహించి మిత్రులు ఇన్నయ్య గారి పుస్తకాలను ఉచిత ఈ పుస్తకాలుగా దీప్తిధార బ్లాగులో ఉంచినా వాటి (పుస్తకాల) అమ్మకాల పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒక ఉదాహరణగా రాష్ట్ర రాజకీయ చరిత్ర: వందేళ్ల విశ్లేషణ 1910 – 2010 -నరిసెట్టి ఇన్నయ్య పుస్తకాన్ని చెప్పవచ్చు. ఇది ఉచిత ఈ పుస్తకంగా ఇచ్చినా, పుస్తక అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గలేదు. మీ వ్యాసాలకు అంతర్జాలంలో గుర్తింపు, స్పందనా రెండు ఉన్నాయి. అచ్చులొ ప్రచురించే వ్యాసాలకు వచ్చే స్పందన రచయితలకు తెలియదు. బ్లాగు వ్యాసాలకు తక్షణ స్పందన లభించగలదు. బ్లాగులో మీ వ్యాసాలను కొనసాగించవచ్చు.

http://bhandarusrinivasarao.blogspot.com/2010/10/blog-post_24.html

సైన్స్ ఫిక్షన్ కథ పుస్తకం కవర్ ఇది

సైన్స్ ఫిక్షన్ కథలు అనే పేరు సాధారణంగా ఉంది. పుస్తకానికి ఒక చక్కటిపేరు (సైన్స్ స్ఫురించే విధంగా)పెట్టి, కింద  సైన్స్ ఫిక్షన్ కథలు  అని వ్రాస్తే చాలా బాగుండేది. ఈ కధలు నేను చదవలేదు.  అయినా ఉదాహారణకు ఈ పుస్తకానికి ఎలాంటి పేర్లు ఉంచవచ్చో సూచిస్తాను. పాలపుంతలో తుఫాను,  రేపటి మానవుడు, వీనస్ నుంచి ఒక ప్రేమ కధ, జాబిలితో చెప్పనా,  నా పేరు ZX - నా ఊరు అంగారక గ్రహం  వగైరా. ఈ కధా సంపుటికి అనువైన పేరు ప్రచురించిన కధలలో దేనికైనా ఉంటే దానిని వాడవచ్చు. ముఖ చిత్రం గురించిన చర్చ చేస్తూ ముఖ చిత్రం రచించిన వారిని విస్మరించటం  సమంజసం కాదు కదా!  చిత్రకారుని పేరు తెలుపకోరుతాను.  

http://kasturimuralikrishna.com/?p=1552

అఖిలాంధ్ర పాఠకులకు
"ప్రచురణ  వైరాగ్యం "
-బాగుంది; ఇది ప్రసూతి వైరాగ్యం లాంటిదిగా తోస్తుంది. అవే లక్షణాలు. మరో బిడ్డకు తల్లి, మరో పుస్తకానికి రచయిత అడ్డు చెప్పగలరా?
పుస్తకాల ప్రచురణలో మీ అనుభవాలతో ఒక టపా వ్రాసేయండి మరి.  

http://chandralata.blogspot.com/2010/10/blog-post_07.html

ఓ బాతు అంత్యదశ

 

"మా ఇంటికి ఎదురుగా, పక్కనా సరస్సులు వున్నాయి. వాటిల్లో చాలా బాతులు విహరిస్తుంటాయి. "
ఆ సరస్సులు నేను గమనించలేదు. కొత్త ఇంటిలోకి మారారా ఏమిటి? ఆ సరస్సులు, పక్షులు చూడటానికై మీ ఇంటికి వస్తాను నా తదుపరి చికాగో పర్యటనలో. పక్షుల పై నా ప్రేమ గురించి మీకు తెలియకుంటే  రేడియోలో నా కబుర్లు వినవచ్చు.

రేడియోలో నా ఇంటర్వ్యూ - 1
http://deeptidhaara.blogspot.com/2008/08/2.html

రేడియోలో నా ఇంటర్వ్యూ - 2
http://deeptidhaara.blogspot.com/2008/08/2.html


http://swapnaraagaleena.blogspot.com/2010/10/blog-post_28.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి