శనివారం, జనవరి 22, 2011

గీతాచార్య -ఈ అబ్బాయి చాలా మంచోడు!

ప్రియ, సృజన పాత్రల సృష్టికర్త  ఐన గీతాచార్య  చాలా మంచోడబ్బా.  ఆ పాత్రలు తన కల్పితమేనని ఎంతో నిజాయితీగా ఒప్పుకొన్న గీతాచార్య కు జెజేలు.

ప్రియ .. we miss you అంటూ  పెక్కుమంది పాఠకులు కంట తడి పెడినప్పటి సందర్భంలో, అసందర్భ ప్రేలాపనగా ఉన్న మలక్పేట్ రౌడీ వ్యాఖ్య   కలవరాన్ని సృష్టించి  టీ కప్ లో పెద్ద తుఫాన్ రేపింది. ప్రమదావనం సభ్యులు నాలుక కరుచుకోక తప్పింది కాదు. నిజానికి ఇది, ప్రమదావనం సభ్యులు గాని, బ్లాగ్ పాఠకులు గాని ఊహించనిది. ఇందులో ప్రమదావనం సభ్యుల తప్పేమి లేదు.   వారిపై కొన్ని బ్లాగులలో వ్రాసిన వ్యాఖ్యలు సభ్యంగా లేవు. వాటిని ఖండిస్తున్నాను.  టపా వ్రాసి పొరపాటు గ్రహించిన జ్యోతక్క టపా తీసివేయటం కూడా సరైనదే. అయితే  టపా తీసివేసిన కారణాలు పేర్కొంటూ తను మరొక టపా వ్రాయటానికి బదులు మౌనంగా ఉండి  పలు ఊహాగానాలకు తెరలేపటం  సమంజసమా?  

ఈ ప్రహసనం లో 33  నెలలుగా  పలు అవతారాలను సమర్ధంగా పోషించిన గీతాచార్య ను చూస్తుంటే దశావతారాలు చిత్రం లో కమల్ హసన్ గురుకొస్తున్నాడు. ప్రతిభావంతమైన ప్రదర్శనే ఇది. ప్రియ, సృజన పాత్రల తో ఎందరో  హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని, ప్రేమను పొందగలిగాడు.  ధన్యవంతుడు. ఇంతటి స్మృజనాత్మక శక్తి  తన చదువులో పెట్టుంటే ఈ సరికి డాక్టరేట్ వచ్చి వుండెడిది.  గీతాచార్య అపూర్వ ప్రతిభ గుర్తించి  ప్రియ, సృజన పాత్రల సృష్టికర్త  ఐన  గీతాచార్యకు అపర బ్రహ్మ  అనే బిరుదు  దీప్తిధార  ప్రదానం చేస్తుంది. చురుకైన మేధతో గీతాచార్య  ను " వాడే వీడు"  అని షెర్లాక్ హోంస్ పద్ధతిలో కనుగొన్న మలక్పేట్ రౌడీ కు టెంపోరావ్ బహుమతిని దీప్తిధార ప్రదానం చేయుటకు సంతసిస్తున్నది.

ఇక చివరగా అభ్యాస కాలపట్టికల   ప్రకారం  అభ్యాసం చేసి అమెరికాలో మరాథన్  విజయవంతంగా పూర్తి చేసిన బహుదూరపు బాటసారి,   భారతీయ గూడచారి విభాగం లో పనిచేసే మేజర్ చంద్రకాంత్ సహకారంతో తెలుగు బ్లాగ్ గేట్ - పెద్ద కుంభకోణం  ఆవిష్కరించినందులకు వారిరువరకు   వీరతాళ్లు వేస్తున్నది దీప్తిధార. మలక్పేట్ రౌడీ, బాటసారి  ఈ కుంభకోణాన్ని కనుగొన్న విధానం వివరిస్తే , ఇలాంటి  పరకాయప్రవేశాలను భవిష్యత్ లో నివారించవచ్చు.  

13 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ చెప్పారు...

ఇంకా గీతాచార్య క్రింది లింక్ లో నుడివినట్టుగా
http://thinkquisistor.blogspot.com/2011/01/blog-post.html

ప్రియ చనిపోయిన న్యూస్ చెప్పటమ్మాని, ఆ పిల్ల ఫొటోని పెట్టటం గురించిన ఆత్రుత (ఇప్పుడబద్ధమని తేలినా, ఎదుటి వాళ్ళతో ఇంట్రూడయ్యేది ఎవరు? ప్రమదావనంలో కొందరు అనవసరపు డామినేషన్ని నిరశిస్తూ వెళ్ళటానికి కారణమెవరు? సృజననైనా, ప్రియనైనా గుంపు టపాల కోసమని ఆర్డర్లు జారీ చేసిన విషయం? ఆ గుంపులో ఉన్న వాళ్ళలో తెలియకుండా ఉన్న అసంతృప్తి సంగతి? @@ఆడా, మగాఅ న్న విచక్షణ కూడా లేకుండా కాగడా మొగుడు పేరుతో రేపిన గొడవ? హాసినీ, శాకినీ, ఢాకినీ, పేర్లతో అటోటీ ఇటోటీ వేసినప్పుడు?@@

@@ ల మద్య ఉన్న విషయమే కనుక నిజం ఐతే ముందు ముందు పరిణామాలు తీవ్రం అయ్యే అవకాశాలు మెండు

Indian Minerva చెప్పారు...

The case is quite interesting I shall say. This guy is by all means a genius and so had been able to pull wool onto your eyes :). కేసు పరిశోధన వివరాలు బయటపెట్టాలని మలక్పేట రౌడీని కోరడమైనది. ఇంకా ఆ కామెంటుకూడా... (నా కెక్కడా ఆ కామెంటు కనపడలేదు). కాకపోతే ఆతను తననుతాను సమర్ధించుకొనే తీరులో మాత్రం streak of psychosis కనిపిస్తోంది. I wish a good end for the hullabaloo.

Praveen Sarma చెప్పారు...

తెలుగు బ్లాగులకి ఇది కొత్తే కానీ ఇంగ్లిష్ బ్లాగులు & ఫోరంలలో ఇది మామూలే. 2002 నుంచి ఇంగ్లిష్ ఫోరంలలో ఉన్న అనుభవంతో చెపుతున్నాను.

కత పవన్ చెప్పారు...

@@ఆడా, మగాఅ న్న విచక్షణ కూడా లేకుండా కాగడా మొగుడు పేరుతో రేపిన గొడవ? హాసినీ, శాకినీ, ఢాకినీ, పేర్లతో అటోటీ ఇటోటీ వేసినప్పుడు?@@

---------------
ఇది నిజమని రుజువైతే మాత్రం
ఆ ప్రమదావనం బాచ్ లో ఉన్న అందరికి తప్పవు టార్చర్ లు

RK చెప్పారు...

రావు గారు, ఆ అమ్మాయి అసలు అమ్మాయే కాదన్న విషయాన్ని పాపం మీ వయసుపైబడ్డ హృదయం ఎలా తట్టుకుంటోదండీ! :(

mirchbajji చెప్పారు...

Holly Wood movies like chese naaku TELUGU MOVIES ante chinna choopu. Kaani ee Telugu Bloggerla lokam lo ilaanti scenes Thrilling gaa unnayi.

Malakpet Rowdy చెప్పారు...

Please dont give me the credit for something I didnt do!

Praveen Sarma చెప్పారు...

గూగుల్ బజ్‌లోని సంబాషణ ఇది:
>>>>>>>>>>
Praveen Mandangi - Buzz - సార్వజనీన - మ్యూట్ చెయ్యబడింది
నాగార్జున యూనివర్శిటీలో పాతిక-ముప్పై వేలు జీతానికి పని చేసే ప్రొఫెసర్ ఓడ అద్దెకి తీసుకుని అట్లాంటిక్ మహా సముద్రం మీద పెళ్లి చేసుకున్నాడంటే నమ్మేసిన వాళ్లు నిజంగా బకరాలు కాకపోతే ఏమిటి?సవరించు
Shiva Bandaru - ఇక్కడ అందరూ బకరాలయ్యారు. కొందరు తక్కువ బకరాలయ్యరు ... కొందరు ఎక్కువ బకరా అయ్యారు. అదీ తేడా..
>>నాగార్జున యూనివర్శిటీలో పాతిక-ముప్పై వేలు జీతానికి పని చేసే ప్రొఫెసర్
దీన్ని నిజమని నువ్వు నమ్ముతున్నావా?జనవరి 22తొలగించుతొలగింపును అన్డు చెయ్యిస్పామ్‌ను నివేదించుస్పామ్ కాదు
2 మునుపటి వ్యాఖ్యలుShiva Bandaru, Praveen Mandangi నుండి
Praveen Mandangi - పల్లెటూర్లో టీచర్‌గా పని చేస్తూ 17,000 జీతం సంపాదించేవాళ్ల దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండకపోవచ్చు. గీతాచార్య ప్రొఫెసరే కావొచ్చు కానీ అట్లాంటిక్ సముద్రంలో ఓడ మీద పెళ్లి అనేది నమ్మశక్యంగా లేదు.సవరించుజనవరి 22తొలగించుతొలగింపును అన్డు చెయ్యిస్పామ్‌ను నివేదించుస్పామ్ కాదు
Praveen Mandangi - దొంగ ఐడిలు పెట్టి ఆడ బ్లాగర్లని ట్రాప్ చేసే క్రిమినల్ మైండ్ బాగా చదువుకున్నవాడికే ఉంటుంది కానీ పని లేక రోడ్ల మీద తిరిగేవాడికి ఉండదు.సవరించుజనవరి 22
>>>>>>>>>>

swapna@kalalaprapancham చెప్పారు...

ee priya evarabba?
naku srujana telusu geethacharya wife kada. ayithe idanta uttidena. amma baboy bale fool ni chesare. U r really gr8.

Praveen Sarma చెప్పారు...

నేను మొదటి నుంచి గీతాచార్య బ్లాగులు చదువుతున్నాను. నాకు మొదటి నుంచి అతని మీద అనుమానమే. ఖని తవ్వి సున్నపురాళ్లని బయటకి తీసింది మాత్రం అప్పలరాజు. ఈ లింక్ చదవండి: http://appalaraj.blogspot.com/2010/12/blog-post.html

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

ఏమిటో ! ఈ గీతాచార్య అనే ఆయనెవడో, ఆ నారీమణులెవరో, తధిగిణతోంలా మీ గోలేమిటో! ఆపైన ఈ ప్రవీణు శర్మ ఒహడు. ఏమి వాగుతాడో, ఏమి రాస్తాడో అర్థమయిన వాడుంటే వాడికి కనకపు సింహాసనం కాకుండా శునకపు సింహాసనం బహూకరిస్తా. రావుగారు మీ ఎరికలో ఉంటే చెప్పండి...

ఇహ ఇలాటి వెధవ గోల టపాలు రాసారంటే, మీ బ్లాగు నా చిట్టాలోనుంచి తీసివెయ్యబడుతుందన్న ప్రమాదం ఉంది అన్న సంగతి తెలియచేసుకుంటూ.....:)

ఒహ సంగతి గుర్తుకొచ్చింది - "పుణ్యోపేతం పుండరీకాయతాక్షం" అని ఆ జగన్నాధుడిని ప్రార్థిస్తూ ఉంటే, పుండరీకాయా? ఏ చెట్టుకి కాస్తుంది అని అడిగాట్ట ఒకడు. ఇదిగో ఈ చెట్టే అని బొమ్మ గీసి చూపించాట్ట ఒకడు. అబ్బో ఆ కాయ రుచి నీకేం తెలుసు అన్నాట్ట ఇంకోడు! అబ్బే అది కాయ కాదు బాబూ ఫలం, మధురమైన ఫలం, "ప్రియ"మైన ఫలం అన్నాట్ట ఇంకొహడు. ఇహ జగన్నాథుణ్ణి పట్టించుకునేదెవరు?

Snkr చెప్పారు...

వాడెవడోగాని, గొప్ప కేటుగాడు. ఇంకొద్దిగా సక్రమ మార్గంలో పయనిస్తే ఓ హర్షద్ మెహతా, ఓ తెల్గీ, ఓ రామలింగరాజు, ఓ డిఎంకె రాజా అయ్యే అవకాశాలున్నాయ్.
మలక్ పాత్ర ఏమీలేదు, కాలికి ఆ తీగె తగిలి బోర్లా పడ్డాడంతే! :) కావాలని కాదు -పొరపాటున ఆవిష్కరించాడు. :D

buddy చెప్పారు...

baaga chepparu..nenu kuda koncham analyse chesaanu vaadi gurunchi..to think abt this ppl..actually it was done long back..now its time to knw the points.. just watch here in ma blog
http://kittutalkz.blogspot.com/2011/01/blog-post.html ..
just see and let me knw ur opinion..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి