Anjana Sowmya Photo courtesy: Muzigle.com
అవరోహణలు
2000 లో పాడుతా తీయగా పిల్లల పోటీలో విజేత.
2004 లో ఈ టివి ప్రియా ప్రియతమ రాగాల విజేత.
2005 సింగపూర్ మరియు చెన్నై ల లో కర్ణాటక, భక్తిగీతాల కచ్చేరి
2010 మా టివి సూపర్ సింగర్ పోటీలో విజేత
2010 లో అమెరికా లో జి ఆనంద్ నవతరం స్వరమాధురి,చక్రి టాలీవుడ్ హంగామా ల లో సహ గాయకులతో కలిసి పాట కచ్చేరి.
సినిమాలు:ఆలయం, జులాయి, క్లాస్‌మేట్స్, ప్రేమలోకం, న్యాయం కావాలి మొదలగు చిత్రాలలో నేపధ్య గాయని.
విజేత అయ్యాక చాలా సినిమాలలో పాటలు పాడినా అవి ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. అయితే కోటి సంగీత సారధ్యం వహించిన క్లాస్‌మేట్స్ లో మల్లికార్జున్ తో కలిసి పాడిన మౌనమెందుకు, దరిచేరవెందుకు అన్న సిరివెన్నెల పాట ఆమెకు తృప్తి, గుర్తింపు తెచ్చాయి. తాజాగా మా పసలపూడి కధలు టి.వి. ధారావాహికకు పాడిన టైటిల్ సాంగ్ ఆమెలోని ప్రతిభను మరోసారి వెలుగులోకి తెచ్చింది. నిస్సందేహంగా సౌమ్య చక్కటి గాయని. అయితే, తన గాన మాధుర్యాన్ని పూర్తి స్థాయి లో ఉపయోగించుకునే పాటలు పాడే అవకాశం కోసం ఈ తెలుగు కోకిల ఎదురు చూస్తూ ఉంది. ఆ అవకాశం లభిస్తుందని, సౌమ్య మరింత ఎత్తుకు ఎదుగగలదని ఆశించవచ్చు.
తాజాగా అంధ్రప్రదేష్ అనే లఘుచిత్రానికి అంజనా సౌమ్య శ్రావణ భార్గవి, పవన్ ల తో కలిసి నరేష్ సంగీత సారధ్యంలో పాడిన పాట చూడండి. ఈ పాట రచయిత సాహిత్య సాగర్. దర్శకత్వం: వాసు నిర్మాణం: TEAM WORKS
ఫేస్‌బుక్ లో మీరు అంజనా సౌమ్య అభిమానులలో చేరాలనుకుంటే ఈ లంకె ద్వారా చేరవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి