గురువారం, జనవరి 20, 2011
ప్రియ అల్లరి ఆగకూడదు
ప్రియ అల్లరి కి (అల్లరి సరాగాలు కూడా....) ఇంతమంది అభిమానులున్నప్పుడు ప్రియ ఎక్కడికి వెళ్తుంది? ప్రియరాగాలు ఆగకూడదు. వైష్ణవి హరివల్లభా! నీ శక్తితో,యుక్తితో ప్రియకు మరల జీవం పోయలేవా?
వైష్ణవ జనతో తేనే కహియేజే,
పీడ పరాయీ జానే రే
పర దుక్ఖే ఉపకార్ కారే తోయే,
మాన్ అభిమాన న ఆనే రే .... వైష్ణవ జనతో...
వైష్ణవుడికే కదా ఇతరుల బాధ తెలిసేది
దిక్కులేనివారిని ఆదుకునేది
గర్వాన్ని దరిదాపులకు రానీకుండా
సకల్ లోక మ సహునే వందే,
నిందా న కరే కేని రే
వాచ్ కాచ్ మాన్ నిశ్చల్ రాఖే,
ధన ధన జనని తేని రే .... వైష్ణవ జనతో.....
సహిస్తూ, ప్రపంచాన్ని స్తుతిస్తూ
ఎవరిగురించీ చెడుగా చెప్పని
మాటలు,చేతలు,ఆలోచనలు నిర్మలంగా కల
నిను కన్న మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలు!
చావు, పుటక ల కిటుకు తెలిసిన గీతాచార్యా, ప్రియకు పునర్జన్మ నీయవా? అంతా విష్ణు మాయే కదా!
ప్రియరాగాల అభిమాని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
12 కామెంట్‌లు:
ఏది ఏమైనా నీ అల్లరి బాగు౦ది గీతాచార్యా ..ఒకసారి వస్తే స్వయ౦ గా అభిన౦దిస్తా౦ :)
Are you disappointed, CB Rao? ;)
I can understand. A boy behind a girl's name.
ఏంటి సార్, ప్రేతాత్మల గురించి పద్యాలే పాడుతున్నారు!
హహహహహహహహహ
@శరత్ 'కాలమ్': అవి పద్యాలు కావు. ప్రార్ధనలు. ప్రియకు మరో జన్మనివ్వమని గీతాచార్యకు విన్నపాలు.
బాబోయ్ మీరు కూడా కెలుకుడు మొదలుపెట్టేశారన్నమాట. Welcome to KeBlaaSa :))
Jus kiddin
@Malakpet Rowdy : కెలుకుడా! తెలుగు బ్లాగులలో నాకు నచ్చనివి కెలుకుడు బ్లాగులు.
మరి నచ్చేవి ఆడ బ్లాగులూ, నాస్తిక బ్లాగులూ? ;)
>>చావు, పుటక ల కిటుకు తెలిసిన గీతాచార్యా, ప్రియకు పునర్జన్మ నీయవా?
ఇన్ని సంవత్సరాలు లేని అమ్మాయిని ఉన్నట్లు నమ్మించగలిగారంటే అస్సలు నిజంగా గ్రేట్!
ఈ ప్రియ ఎవరు? మీ చుట్టమా? వైష్ణవి హరివల్లభనా! ఇదేం పేరు? ఈవిడెవరు? ప్రియకు జీవం పొయ్యటమేమిటీ? ఆవిడ ఎందుకు పోయింది? ఒకవేళ బతికి వస్తే మీకు వచ్చే లాభమేమిటి? మీకు ఆవిడేమన్నా బాకీ ఉందా? మీరే ఆవిడకు బాకీ ఉన్నారా?
జోక్ అని కాదు కానీ - ఇంతలా ఇమోషనల్ అయిపోతున్నారు కాబట్టి - ఆవిడెవరో నిజంగా అమ్మాయి కాదనీ, నమ్మించారనీ ఈ పై ప్రణవ్ అనే ఆయన రాసినదాని బట్టి ఈ క్రింది విధంగా కామెంటుతున్నా - పోనీ మీరే ఓ ఏనుగు తల వెతికి తీసుకురండి, ఆ తర్వాత బ్రహ్మను ప్రార్థించండి....మీ అదృష్టం బాగుంటే బతికొస్తుంది...లేకుంటే మీరే ఆ హిమాలయాలకు పోయి సంజీవని తీసుకు రండి.....ఏ సంగతి కొద్దిగా వివరించండి...
ఈ పైనున్న లింకులు చదవమని సలహా పడెయ్యొద్దు....ఆ "నామాలు" చూస్తేనే ఏదో తేడాగా ఉన్నాయి......పంగనామమైపోతుందని భయంగా ఉంది నాకు...అడ్డ నామమైతే ఫరవాలా...తట్టుకోవచ్చు....అయినా మీరు కవితలు రాయటమేమిటీ ఈ వయసులో? పైగా ఓ ఆడపిల్ల గురించి? నారీ నారీ నడుమ మురారిలా ఈ గీతాచార్య ఎవరు? కథా కమామీషు చెపితే సంతోషం...
@వంశీ: ఈ దిగువ గొలుసులు వీక్షించండి.
http://priyamainamaatalu.blogspot.com/2011/01/blog-post.html
http://godicherla.blogspot.com/2011/01/blog-post.html
"ఈ ప్రియ ఎవరు? మీ చుట్టమా?" -అవును. బ్లాగ్బంధువు.
"అయినా మీరు కవితలు రాయటమేమిటీ ఈ వయసులో?" - వంశీ గారు- ఇవి కవితలు కావు. వైష్ణవ జనతో తేనే కహియేజే,
పీడ పరాయీ జానే రే -మహాత్మా గాంధి కి ఎంతొ ఇష్టమైన ప్రార్ధనా గీతం ఇది. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గొంతులో ఈ పాట వినటానికి గాంధి అభ్యర్ధించేవారు. ఈ ప్రసిద్ధ గీతాన్ని 15వ శతాబ్దంలో నర్సింహ్ మెహ్తా గుజరాతి భాషలో వ్రాశారు.
@RK: నా అభిమాన రచయితలలో పురుషులు ఎక్కువ. స్త్రీలు కూడా ఉన్నారు కాని, వీరి శాతం తక్కువ. నా అభిమాన రచయితలు సంజీవదేవ్, ముళ్లపూడి, పిలకా గణపతి శాస్త్రి, ఆవుల గోపాల కృష్ణమూర్తి, నార్ల వెంకటేశ్వర రావు,ఇన్నయ్య,చలసాని ప్రసాదరావు, యండమూరి, మల్లాది, రంగనాయకమ్మ ప్రభృతులు. ఇన్నయ్య గారి వెబ్‌సైట్, బ్లాగు, నార్ల, ఎ.జి.కె. బ్లాగుల నిర్వహణ చేస్తున్నాను. శ్రీయుతులు సంజీవదేవ్, నార్ల వెంకటేశ్వర రావు,ఇన్నయ్య,చలసాని ప్రసాదరావు,శ్రీ రమణ ఇంకా పలు రచయితలు వ్యక్తిగత మిత్రులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి