మంగళవారం, మే 27, 2008

బ్లాగ్వీక్షణం -10


మన చేరా అభినందన సంచిక

మ్ర్యాఁవ్...!!
http://yarnar.blogspot.com/2008/05/blog-post.html?showComment=1211663340000#c5194104901504150554

పిల్లికి చదువు నేర్పితే, మ్ర్యాఁవ్...!! అని అంటుందని సెలవిస్తున్నారు రానారె. రాయలసీమ యాసలో సాగిన ఈ చిన్ననాటి ముచ్చట్లు చదువుతుంటే, జున్ను తిన్నట్లే వుంటుంది, తెలుగు భాషా ప్రియులకు. ఈ కథనానికి మచ్చుగా చూడండి."మా రాతిమిద్దెలో తేళ్లూ జెర్రులూ జాస్తి. ఇంటి సుట్టూరా రాతి పారిగోడ, యింటి ముందర కొండరాతి తెట్టె వుంటాది కాబట్టి అడపాదడపా పాములు కూడా కనబడతావుంటాయ్." ఈ ' కొండరాతి తెట్టె ' కు అర్థం చెప్పటానికి ప్రయత్నం చెయ్యండి.

హిమాలాయాలలో ట్రెక్కు - ట్రావెలాగుడు ౧
http://praveengarlapati.blogspot.com/2008/05/blog-post_25.html

హిమాలయాలు -హిమ కు ఆలయాలు.మంచు పర్వతాలు, పార్వతీ పరమేశ్వర నిలయాలు.ఇవి సుమనొహరాలు. హిమగిరి సొగసులు వర్ణించే సాహసం చేస్తున్నది ప్రవీణ్. ప్రతి సంవత్సరము, Youth Hostels Association of India వారు ఈ పర్వతాలలో ట్రెక్కింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఉత్సాహ వంతులు, ఈ ట్రెక్ లో చాలా తక్కువ ఖర్చులో, ఎక్కువ సంతోషాన్ని పొందగలరు. కులూ-మనాలి లోని ఈ పర్వత, సాహస ట్రెక్, ట్రావెలాగ్ ఆసక్తికరంగా సాగుతుంది. మీరూ చదవండి.

నేను లోక్‌సత్తాకు వోటెందుకేస్తానంటే..
http://chaduvari.blogspot.com/2008/05/blog-post_25.html

కూరగాయల మార్కెట్లో అన్నీ సచ్చు వంకాయలే వున్నప్పుడు, వంకాయలు ఎలా కొనడం? ఉన్న వాటిల్లో మంచివి ఏరుకొని కొంటాము. You opt for lesser evil, while voting in elections. అంతా అవినీతిమయం గా వున్న రోజులలో, జయప్రకాషే దిక్కంటున్నారు, చదువరి. లోక్‌సత్తాకు ఒక సారి ఛాన్స్ ఇచ్చి చూద్దామా?


తెలుగు రచయితల సంఘం ఏర్పాటు-రచయితలు గైర్ హాజరు!
http://kasturimuralikrishna.wordpress.com/2008/05/22/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%98%e0%b0%82-%e0%b0%8f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b0%be/

మీ పుస్తకావిష్కరణ సభకు 300 మందిని ఆహ్వానిస్తే, కెవలం ముగ్గురే (భార్య, తల్లి, చెల్లెలు) సభకు హాజరయితే, గుండె చెరువవదా? కథలకు కాలం చెల్లిందా? నవలలకు పూర్వవైభవం ఎట్లా తీసుకు రావాలి? కథలను కంచికి బదులు, శ్రీకాకుళం కారామాస్టారింటి వైపు ఎట్లా తీసుకు వెళ్లేది? తెలుగు రచయితలపై ప్రచురణకర్తల శీతకన్నుకు కారణం ఏమిటి? రచయితలు వారి రచనలు వారే ప్రచురించుకొంటే, పసలేని రచయితలని అర్థమా? ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కస్తూరి మురళీ కృష్ణ.

ఆకాశ వీధిలో ' ఆకుపచ్చ కన్నీరు '
http://thotaramudu.blogspot.com/2008/05/blog-post.html


“ఇలాంటి చాన్సు మళ్ళీ దొరకదని ఆ air hostess పైలెట్ వైపు తిరిగి గట్టిగా "ఉస్కో" అని అరిచింది......రన్వే మీద కూడా పోనివ్వకుండా డైరెక్టుగా గాల్లోకి ఫ్లైటు లేపాడు పైలెట్.....

గాల్లో ఉన్నాము...” ఇది DSG తోటరాముడి brand హాస్యం. అదేనండి రెండు రెళ్ళు ఆరు లోని తాజా హాస్య రసం. ఇది తాగి కడుపుబ్బ నవ్వుకోండి.

మాతృభూమి!
http://sangharshana.blogspot.com/2008/05/blog-post_08.html

మాతృభూమి చిత్ర సమీక్ష ఇది. గుండె చిక్కబట్టుకుని చదవవలసిన సమీక్ష.
ఈ సినెమా కధ ఒక ఊహ నించి పుట్టింది. మనీష్ ఝా ఈ కధను రచించి, సినీమా దర్శకత్వం వహించారు. వర కట్న దురాచారం దేశం లో మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. ఇప్పటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అబార్షన్ చేయించడం, ఆడ పిల్ల పుడితే రక రకాల హేయమైన పద్ధతుల లో ఆ పసిగుడ్డును చంపటం.. జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆడ సంతానాన్ని చంపటం.. ఇదే రేట్ లో కొనసాగితే.. కొన్నాళ్ళకి దేశం లో ఆడవాళ్ళే కరువుతారు. అటువంటప్పుడు సామాజికంగా ఎటువంటి పరిస్తితులు ఎదురవుతాయో అని ఊహించి తీసిన చిత్రం ఇది. గడ్డిపూలు సుజాత సమీక్ష. మిమ్ములను ఆలోచింపచేస్తుంది.


ఆ వ్యర్థాలు సేకరించింది డాక్టర్‌ రెడ్గీస్‌ నుంచే...,మరో వ్యర్థ బాగోతం - ఈసారి 'అరబిందో'
http://pichukalu.blogspot.com/2008/05/blog-post_24.html

హైదరాబాదు వాసులకు బాగా తెలిసిన విషయం. ఏ అర్థరాత్రో నిద్ర నుంచి మెలకువ వచ్చి,బయటకు వస్తే, భయంకరమైన విషవాయువులు. జనం గాఢ నిద్రలో మునిగి వుండగా, చడీ,చప్పుడు కాకుండా పారిశ్రామిక వేత్తలు ఈ విష వాయువులను గాలిలోకి వదులుతుంటారు. కాలుష్య నివారణ మండలికి ఫిర్యాదు చేస్తే, ఏవో నామ మాత్రపు దాడులు నిర్వహిస్తారు. వారం రోజులకు కథ మళ్లీ మొదలవుతుంది. అసలు ఈ కాలుష్యం ఎక్కడుంది? Pollution Control Board లోనా? ఈ కాలుష్యం నివారించేదెట్లా? పర్యావరణ సమస్య పై రాజేంద్ర కుమార్ ఎడతెగని కథనాలలో, మరో కథనం.

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Thanks for introducing so many good blogs...

cbrao చెప్పారు...

మీకు blogger identity లేక anonymous గా సందేశం పంపినట్లుగా భావిస్తా. ఇలాంటి పరిస్థితిలో, సందేశం కింద, మీ పేరు,e-mail రాయగలరు. నేను పరిచయం చేసిన టపాలు మీకు నచ్చినందుకు ప్రమోదం.

రానారె చెప్పారు...

రావుగారూ, నమస్తే. :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి