శనివారం, మే 17, 2008

బ్లాగ్వీక్షణం -8


తల్లీ బిడ్డ

అసహాయతా హాస్యాలు
http://onamaalu.wordpress.com/2008/04/15/asahayatahasyalu/

పిల్లల్ని పెంచటం లో వుండే కష్టాలను,ఆ తల్లి చేసే త్యాగాలను మరో మారు గుర్తుచేస్తున్నారు లలిత.G. అమెరికా లో వుద్యోగం చేసే తల్లులు, ఒక అయాను వుంచుకోవటానికి ఎందుకు వెనకాడతారో!

ప్రపంచమే ఒక పచ్చని పూలతోట
http://pichukalu.blogspot.com/2008/05/blog-post.html

అమ్మో ఎండలు! ఈ సంవత్సరం వున్నన్ని ఎండలు గతంలో ఎప్పుడూ లేవు అని ప్రతి సంవత్సరమూ అనుకోవటం ఆనవాయితీ అయ్యింది. ఈ Global warming తగ్గటానికి ఏమి చెయ్యాలి? బత్తీబంద్ చెయ్యాలి అంటున్నారు విశాఖతీరాన్నుంచి రాజేంద్ర కుమార్ దేవరపల్లి. నేనింకో ఊసు చెప్తున్నా. వినుకోండి.Incandescent light bulb స్థానం లో Fluorescent bulb ఎంతొ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. Power shortage సమస్యకు పరిష్కారంగా, తక్కువ విద్యుత్ ఖర్చుతో, ఎక్కువ కాంతి తో గృహాన్ని నింపవచ్చు.Fluorescent bulb వాడకాన్ని ప్రోత్సాహించండి. ఏమంటారు?


ఒ భగ్న హృదయం ....... ఒ బీరు క్యాను
http://kotthachiguru.blogspot.com/2008/04/blog-post_26.html

ఆడ పేరుతో బ్లాగులు రాసేవారు నిజంగా ఆడవారేనా? లేక వెరేనా? బ్లాగు చదివి ఆ అమ్మాయి అంటే పడిచచ్చి,డ్రీం సాంగ్ వేసుకునే సమయానికి, ఆమెకు రెండు రోజుల క్రితమే పెళ్లయిందని తెలిస్తే,ఏం జరుగుతుంది? ఒ భగ్న హృదయం ....... ఒ బీరు క్యాను. M.Bhanu Prasad రచన ఇది.


మలేషియా లో మన పరిస్థితి - Silent Ethnic-Cleansing
http://madhubaabu.blogspot.com/2008/05/silent-ethnic-cleansing.html

మలేషియా లో భారతీయులపై జరుగుతున్న అకృత్యాలు మనము పేపర్ లో చదువుతూనే వున్నాము. ఉద్యోగ ప్రకటనలో HR Consultant ఉద్యోగానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, భారతీయులు తప్ప అన్న ఈ ప్రకటన చూడండి.మలేషియా లోని తాజా పరిస్థితులు వివరిస్తున్నారు మధు బాబు గడ్డిపాటి.

మా తాతలు పండించుకుని తిన్నారు!
http://hridayam.wordpress.com/2008/02/06/memories2/

వ్యవసాయం గిట్టుబాటు ఎందుకు కావటం లేదు? రైతుల ఆత్మహత్యలకు కారణ మేమిటి? గ్రామాలలో భావినీరు లోతుకు పోవటానికి కారణ మేమిటి? రైతు సమస్యలకు పరిష్కార మేమిటి? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఎండమావులేనా? గుండెచప్పుడు దిలీప్, వాళ్ల తాత గారి సమయం లోని వ్యవసాయ పరిస్థితులను, నేటి పరిస్థితులతో బేరీజు వేస్తున్నారు.


మా వారి 'అమ్మ ' కథ
http://manishi-manasulomaata.blogspot.com/2008/05/blog-post_14.html

పుట్టింటి నుంచి అత్తింటి కొచ్చినప్పుడు గుండె గుబులుగా ఉండటం సహజం. అమ్మా నాన్నలకు, స్నెహితులకు దూరంగా, ఉండటం, కష్టం గానే వుంటుంది.అత్తే, అమ్మలాంటి స్నెహితురాలయితే? అంతకంటే అదృష్టం ఏముంటుంది? సుజాత శ్రీనివాస్ (మనసులో మాట) తమ అత్తగారి గురించి వివరిస్తున్నారీ టపాలో. మీకూ అలాంటి అత్తగారుంటే ఎంత బాగుంటుందో అని వాపోవడం ఖాయం.

అమెరికాలో.... అష్టకష్టాలు
http://joruga-husharuga.blogspot.com/2008/05/blog-post_15.html

అమెరికా వెళ్లిన కొత్తలో, కొత్త కొలమానాలైన మైళ్లు, గాలన్లు, డైములు, నికిళ్లు, పౌండ్లు కొంత గజిబిజి కలిగించటం సహజమే. రచయిత దైవానిక కష్టాలకు ఆకాశరామన్న, కొత్తపాళి ఇచ్చిన సులభ మార్గదర్శక సూత్రాలు చూడండి.

6 కామెంట్‌లు:

Rajendra Devarapalli చెప్పారు...

ధన్యవాదాలు రావుగారు,మీరన్నట్లు ఆ బల్బులకు స్థానభ్రంశం కలగాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది మనదేశంలో.దానికి గల ప్రధానకారణం అవి చాలా ఖరీదు,రెండోది వాటిపట్ల చాలా మంది విధ్యాధికుల్లో కూడా కనీస అవగాహన లేకపోవటం.

వీవెన్ చెప్పారు...

మీ బ్లాగ్వీక్షణంలో లింకులు నొక్కదగినవిగా ఉంటే బాగుంటుంది. వాటిని కాపీ పేస్టు చేసుకోవడం ఇబ్బందిగా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

Q: "అమెరికా లో వుద్యోగం చేసే తల్లులు, ఒక అయాను వుంచుకోవటానికి ఎందుకు వెనకాడతారో!"
A: "బ్రెస్ట్ ఫీడింగ్" కి ఇండియాలోనే ఆయాలను ఎర్పాటు చేసుకుంటున్న నేపధ్యం లో అమెరికాలోని తల్లులు ఆయాలను ఏర్పాటుచేసుకోలేకపోవడం కాదు. $ సేవింగ్స్ కాదా?
అవును, మీరు "తెలుగు తల్లుల" గురించేన అంటా?

కొత్త పాళీ చెప్పారు...

"అమెరికా లో వుద్యోగం చేసే తల్లులు, ఒక అయాను వుంచుకోవటానికి ఎందుకు వెనకాడతారో!"
mఈరు ఈ ప్రశ్న తెలిసి ఆదిగారో తెలీక అడిగారో అర్ధం కావట్లేదు. ఇండియాలో పనిమనిషిని పెట్టుకున్నటు కాదు, ఇక్కడ ఆయాని పెట్టుకోవడం. కేవలం మన కోసమే పనిచేసే ఒక "ఎంప్లాయీ" ని పెట్టుకున్నాము అంటే, ఆ మనిషి జీతానికి సంబంధించిన ఆదాయం పన్ను అట్టే పెట్టి IRS కి అప్పచెప్పాలి, ఆ మనిషికి, అవసరమైతే కుటుంబానికి మెడికల్ ఇన్స్యూరెన్సు వసతి కల్పించాలి .. ఇదంతా .. ఆ జంట సంపాదనలో ఒకరి సంపాదన సరిపోతుంది. లాన్ కట్ చెయ్యడనికి, ఇళ్ళు శుభ్రం చెయ్యడనికి .. ఇటువంటి పనులకి ఆ సేవలనందించే వ్యాపారాలుంటాయి. పని వారు ఆ వ్యాపారాల్లో ఎంప్లాయీలు .. వీరి సేవలు వినియోగించుకోవడం ఖర్చు తక్కువ. టూకీగా ఆదీ సంగతి. అందుకే .. ఇక్కడ పిల్లలని కంటున్న భారతీయ జంటల తలిదండ్రులకి ఇక్కడ ఇంత డిమాండ్! ఆ మధ్యన ఈ మాటలో అనుకూంటా ఒకతను ఒక మంచి కథ రాశాడు .. అమెరికా వచ్చి కూతురి పిల్లని బేబీ సిట్ చేసినందుకుగాను చెల్లింపుల కోసం ఒక తండ్రి కూతురు-అల్లుళ్ళ మీద దావా వేస్తాడు.

రవి వైజాసత్య చెప్పారు...

బి వీసా మీద ఇండియానుండి ఒక పనిమనిషిని దిగుమతి చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు కనీస వేతనం (డాలర్లలో), హెల్తు ఇన్సూరెన్సు, సెలవు దినాలు, వర్కర్ సేఫ్టీ రెగ్యులేషన్లు, లేబర్ తనిఖీలు..అబ్బో ఆ గోల అంతాఇంతా కాదు బాబోయ్. సేవింగేమో కానీ షేవింగైతే అవుతుంది ;-)

cbrao చెప్పారు...

@కొత్త పాళీ,
@రవి వైజాసత్య,
@netizen,

మీ జాబులకు ధన్యవాదాలు. నా జవాబు ఇక్కడ చూడండి.
అమెరికాలో భారతీయ తల్లి తండ్రులు
http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_26.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి