
సంజీవరెడ్డి నగర్ కూడలి ఛాయా చిత్రం: cbrao
ఈ టైటిల్ కొంచం గందరగోళంగా వుందా, హైదరాబాదులో Traffic లాగా? అవునండీ! ఇక్కడి ట్రాఫిక్ ఎంతో ఫికర్ (దిగులు,ఆదుర్దా) కలుగ చేస్తుంది.ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్ జాం అవుతుందో చెప్పలేము. ఇవ్వళ 2-way వున్న మార్గం రేపు 1-way అయితే ఆశ్చర్య పోవద్దు. మార్పు చాలా సహజం. కొన్ని మార్పులు మొదటలో కొంత తికమక కలిగించినా, తరువాత బాగుగా వుందనిపించిన సందర్భాలు కూడా వున్నై. ఉదాహరణకు అమీర్‌పేట, మైత్రీవనం కూడళ్లలో నిన్నటి దాకా వున్న ట్రాఫిక్ జామ్స్ ఇప్పుడు లేవు, ఆశ్చర్యకరంగా. ఆ వత్తిడంతా సంజీవరెడ్డి నగర్ కూడలి పై పడిందిప్పుడు.
నిమ్స్ హాస్పిటల్ (పంజగుట్టా) నుంచి ఎదురు రోడ్ లో, రాజ్‌భవన్ రోడ్ కు వెళ్తే, యశొదా హాస్పిటల్ నుంచి, వాహనం లో రోడ్ దాటాలంటే,రాజీవ్ గాంధి విగ్రహం దాకా వచ్చి, U turn తీసుకుని రాజ్‌భవన్ రోడ్ లోని మాల్స్ కు, బాంక్ లకు వెళ్లాలి. దీనివలన వాహనదారులకు 2 లేక 3 కిలోమీటర్ల దూరం ఎక్కువవుతుంది. పంజగుట్ట కూడలి నుంచి రాజీవ్ గాంధి విగ్రహానికి వచ్చినవారు అక్కడి కూడలి లో కుడి వైపు తిరిగి రాజ్ భవన్ వెళ్లే సౌకర్యం తొలగించారు. దీనివలన వాహనదారులు గ్రీన్ లాండ్స్ దాకా వచ్చి, అక్కడి కత్రియ హోటల్ వద్ద, U turn తీసుకుని వెనుకకు ప్రయాణం చెయ్యాలి. ఈ రెండూ అవాంఛనీయాలే. దీనివలన వాహనదారులకు కాలహరణ, అధిక పెట్రోల్ వ్యయం అవుతున్నై. రోజూ తిరిగే, వేల వాహనాలకు, ఇలాగా చుట్టూ తిరగటం వలన ఎంతో విలువైన పెట్రోల్ వృధా అవుతుంది.
మన దేశం లో నిరుద్యోగం ఎక్కువ. చాలినంత మానవ ఉత్పాదక శక్తి వుంది. యశోదా, రాజీవ్ గాంధి కూడళ్లలో ఇద్దరు ట్రాఫిక్ పోలీస్ లను పెట్టి,కుడి మలుపు అనుమతించటంతో, ఈ చుట్టు తిరుగుడు, అనవసర పెట్రోల్ వ్యయం నివారించవచ్చు. ప్రస్తుత స్థితిలో, దేశానికి అయ్యే అమూల్యమైన విదేశీమారక నగదు (Foreign exchange) ఖర్చు కంటే, ఈ ట్రాఫిక్ పోలీస్ జీతాలకు అయ్యే ఖర్చు బహు స్వల్పం. అధికారులు ఈ విధంగా ప్రజలకూ, దేశానికి లాభం కలిగించవచ్చు.
3 కామెంట్‌లు:
ఈ ట్రాఫిక్ లో చిక్కుకుని ఫికర్ కి గురయిన వాళ్ళలో నేనూ వున్నాను.మనకు ముక్కు తిప్పి చూపటం అలవాటయింది.సూచనలెన్ని చేసినా అమలు పరచేవారేరీ?
Still Hyd is better than Bangalore... You know...
ట్రాఫిక్ అని కాదు గానీ తత్సంబంధిత పెక్కు విషయాలపై టపా రాయాలనే ప్రయత్నంలో ఉన్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి