శుక్రవారం, మే 30, 2008
సయోనారా
జపనీస్ మహిళల సంగ విజయం
జపాన్ లో ఉద్యోగస్తులు "workaholics" మాత్రమే కాక, రాత్రి పొద్దుపోయాక తాగి తూల్తూ ఇంటికి రావటం ఇక ఆగనుంది. నిర్లష్యం చేయబడి, విసుగు చెందిన భార్యలు తిరగబడ్తున్నారు. దీనికి వారిని ప్రోత్సహిస్తున్నది జపాన్ లో వచ్చిన కొత్త చట్టం. విడాకులు తీసుకున్న భార్య, భర్త పెన్షన్ లో యాభై శాతం దాక పొందటానికి కొత్త చట్టం వీలు కల్పిస్తున్నది.
ఇప్పుడు జపాన్ లో నడుస్తున్న పోకడ ఏమంటే, భర్తలు భార్యలతో వాదనలకు దిగటం లేదు. పొరబాటున దిగినా, వాగ్వివాదం లో ఓడిపోతున్నారు. వారంటున్నారు ' మేము వివాదలలోకి దిగము. దిగినా ఓడి పోతాము. ఇవ్వాళ్లైనా, రెపైనా.' మీకు ఒక విషయం విశదమయ్యిందని భావన. అదేమంటే, వీరంతా కావాలని ఓడిపోతున్నారు -భార్య సంతృప్తి కోసం. అంతే కాదు, దశాబ్దాలుగా, Take it for granted గా తీసుకున్న భార్యల మాట వినటమే కాక, వారితో ప్రియం గా సంభాషించటం, ఇంటిని శుభ్రం చెయ్యటం,చెత్త బయట వేయటం ఇంకా వంట చేయటం కూడా నేర్చుకుని, చేస్తున్నారు.
అక్కడి విద్యావంతులైన స్త్రీలు 29 సంవత్సరాలు వయస్సు వచ్చినా, పెళ్లి చేసుకోకుండా, తమ స్వాతంత్రాన్ని కోల్పోక, జీవితాన్ని ఆనందిస్తున్నట్లుగా భావిస్తున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలు, వంట పెంటా జంఝాటం లో పడటాన్ని, వారు ఇష్టపడటం లేదు.
రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న ఉద్యోగులు, భార్య కు కొత్తగా I love you ఎలా చెప్పాలో నేర్చుకొంటున్నారు. వారికి కోడిగుడ్డు పొరటు, బాణి లోని నూడిల్స్ పై వేడి నీరు పొయ్యటం తప్ప, మరేది రాని పురుష అహంకారులు. పిల్లలను వారు ప్రేమిస్తే, పిల్లలు వారిని చూసుకుంటారు కదా అలాగే, భార్యలూ వారికి అడుగులకు మడుగు లొత్తుతారనుకొన్న వారి అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ వేసవి నుంచి అమలు లోకి వచ్చిన కొత్త చట్టం వచ్చాక, విడాకులకు దరఖాస్తు చేసే వారి సంఖ్య ఆరు శాతం పైనే పెరిగింది.
60ఏళ్ల గృహిణులకు తమ పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు అందుతున్నవీ రోజులలో. భార్యకు I love you చెప్పటమే వారి సంస్కృతి లో లేని విషయమయినప్పుడు, భర్తలు తాగి, ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ' I love you.' విడాకులకు భయపడుతున్న భర్తలు, భార్యా బాధితుల సంఘం లో సభ్యులుగా చేరి," మీ సంసారం కాపాడు కోవటం ఎట్లా? “ అనే జెన్ పాఠ్యాంశాలను వల్లె వేస్తున్నారు. జపానీస్ మహిళలకు మంచి రోజులొచ్చాయ్.
నమ్మశక్యం కాని ఈ నిజాన్ని,కింద గల వీడియోలో చూడండి. ఎలా వుంది జపనీస్ మహిళల శక్తి?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి