బుధవారం, మే 14, 2008

బ్లాగ్వీక్షణం -7


కార్టూన్: బ్నిం (బమిడిపల్లి నరసింహ మూర్తి)

ప్రేమ, నిరాశ, జీవితం మీద నిరాసక్తి
http://moortystelugublog.blogspot.com/2008/01/blog-post.html

చలం రచనలతో పరిచయమున్నవారు సౌరిస్, నర్తకి, రమణస్థాన్ అన్న పేర్లు వినే వుంటారు కాని అంతకు మించిన వివరాలు ఎక్కువ తెలియక పోవచ్చు. చలం తో ప్రత్యక్ష పరిచయం కల నారాయణమూర్తి గారు చలం తో తన అనుభవాలు,రమణస్థాన్ లో తను గమనించినవి, మనకు వివరిస్తున్నారు, ఈ టపాలో, ఆసక్తికరమైన కథనం తో.

స్వీట్ మెమోరీస్..
http://arunam.blogspot.com/2008/05/blog-post_13.html

మీరు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి,కుదురుతుందనుకున్న సంబంధం, ఎవో కారణాలతో తప్పిపోతే,ఎప్పుడో అకస్మాత్తుగా కనిపిస్తే,ఆ సమయం లో పక్కనే, మీ శ్రీమతి వుంటే ఆమెను ఎలా పరిచయం చేస్తారు? మాజీ ముఖ్య మంత్రి ఎస్సెం కృష్ణ, బి.సరోజాదేవి ఒకప్పుడు పెళ్లి చేసుకుందామనుకుని, ఎవో కారణాలతో విడిపొయిన విషయం వార్తలలోకి వస్తే, వారెందుకు ఉద్వేగానికి లోనయ్యారు? రమ్యమైన అరుణ పప్పు కథనం ఇది.

బొమ్మరిల్లు
http://oosulu.blogspot.com/2008/04/blog-post_20.html

మీ రెప్పుడన్నా, ఇప్పుడు టి.వి లలో వస్తున్న, ప్రేక్షకులు పాల్గొనే కార్యక్రమాలలో పాల్గొన్నారా? అందులో అనుభవం ఎలావుంటుందో తెలుసుకోవాలంటే,బొమ్మరిల్లు షూటింగ్ లో పాల్గొన్న స్వాతి అనుభవం తెలుసుకోవాలిసిందే.

ETV సుమన్ సుత్తికి, ఊదుడు బాబా వొత్తి
http://telugaksharam.blogspot.com/2008/05/etv.html

"మీ బ్లాగు కు మీరే సుమన్, ప్రభాకర్" అన్న ప్రసిద్ధ నానుడి కి ఆద్యులైన, ETV సుమన్ కు ప్రభాకర్ కు వున్న అవినాభావ సంబంధమేమిటి? ఇది జన్మ జన్మల సంబంధమని చెప్తున్నారు బూదరాజు అశ్విన్. ఎలా అంటే ఈ టపా చదివి తెలుసుకోండి.

"బరువు” బాధ్యతలు
http://manishi-manasulomaata.blogspot.com/2008/05/blog-post_12.html

మన భారతీయులు తెగ తినేయటం వలనే అమెరికాలో నిత్యావసర వస్తువులకు కట కట ఏర్పడిందని బుష్ అయ్యవారు సెలవిచ్చారు మొన్న. పులి మీద పుట్రలా స్వామి రాందేవ్ గారు గారు కూడా బుష్ అయ్యవారు చెప్పినది ఒప్పేనని కితాబిచ్చారు. దానికి నిదర్శనం రోజు రోజుకీ పెరుగుతున్న, భారతీయుల పొట్టలే నట. ఈ అతి బరువు తక్షణం తగ్గించుకోవాలని ఉచిత సలహా కూడా పడేశారు. ఈ బరువు తగ్గటంలో,సుజాత (మనసులో మాట) గారి అనుభవాలు పంచుకుంటే మీకూ లాభం; ఎలాగంటారా, మూడు కిలొల బరువు తగ్గుతారు, అవి చదివితే, అని ఆమె శాపం.

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి......
http://joruga-husharuga.blogspot.com/2008/02/blog-post.html

కోరికలే గుర్రాలయితే? కలలు కంటే కోరినవి నెరవేరుతయా? కథలు రాసి కోట్లు సంపాదించడం ఎట్లా? దైవానిక కథా ప్రయోగం, నలుగురూ మెచ్చినది మీరూ చదవండి.

ఎద లోతుల్లో ఒక మాటుంది…
http://blog.harivillu.org/2008/02/09/manasulo-maata-01/

ఎదలోతుల్లోని మాట చెప్పటం ఎలా? చెప్పాలనుకున్నది గొంతుదాకా వచ్చి ఆపైన చెప్పలేక పోతే, గుండె గాయమవదా? శ్రీనివాసరాజు దాట్ల గుండెల్లోని కవిత, గుండె దాటి బయటకొస్తే, గుండె చెరువవదా?

4 కామెంట్‌లు:

Bolloju Baba చెప్పారు...

చలం గురించి చదివాను . బాగుంది.

Rajendra Devarapalli చెప్పారు...

రావు గారు,ఇక్కడ నొక్కితే అక్కడ తెరుచుకునేలా లింకులివ్వండి నా లాంటి బద్దకస్తులకోసం

నిషిగంధ చెప్పారు...

ధన్యవాదాలు రావు గారూ!
నాకు నచ్చిన బ్లాగుల్లో మూర్తి గారిది ఒకటి.. రాసిన టపాలు తక్కువే అయినా చెప్పిన విశేషాలు చాలా ఉన్నాయి.. ఆయన ఇంగ్లీషు బ్లాగ్ కూడా ఆసక్తికరంగా ఉంది! ఆయన వీలు చేసుకుని తెలుగు లో మరిన్ని టపాలు రాస్తే బావుండుననిపిస్తుంది!

cbrao చెప్పారు...

@నిషిగంధ: మీ పేరుకు అర్థం రాత్రి పరిమళమా? Night queen. మూర్తి గారు చాలా విషయాలు తెలిసిన వారు. తెలుగులో మరిన్ని టపాలు అభిలషణీయమే. కాని, వయసు కూడా సహకరించాలి కదా.

@బొల్లోజు అహ్మద్: చలం గురించిన కథనం మీకు నచ్చినందుకు సంతోషం.

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: సాధ్యమైనతవరకూ లింక్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి